పదో తరగతి పరీక్షలు: నకల్ కొట్టడానికి చిట్టీలు అందించిన పేరెంట్స్
పాట్నా: తమ పిల్లలు బాగా చదివి పరిక్షలు బాగా వ్రాయాలని, మంచి మార్కులు తెచ్చుకొవాలని తల్లి దండ్రులు కొరుకోవడం సర్వసాధారణం. పిల్లలను దొడ్డిదారిలో పాస్ చేయించాలని ఎవ్వరు కొరుకోరు. దీనికి విరుద్ధంగా బీహార్ రాష్ట్రంలో కుటుంబ సభ్యులు, బంధువులు విద్యార్థులకు జవాబులు ఉన్న చిట్టీలు అందించి వారిని పాస్ చేయించడానికి విఫలయత్నం చేశారు.
Family members help students cheat during Bihar Board exams in Hajipur, Bihar https://t.co/yZGcYkgejV
— ANI (@ANI_news) March 19, 2015 గురువారం బీహార్ లో 10వ తరగతి పరిక్షలు జరిగాయి. హాజిపుర్ లోని పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. ఆ స్కూల్ దగ్గరకు విద్యార్థుల కుటుంబ సభ్యులు వెళ్లారు. పరిక్షలు వ్రాస్తున్న వారి ప్రశ్న పత్రాలలో ఉన్న ప్రశ్నలు తెలుసుకున్నారు. తరువాత వెంట తీసుకు వెళ్లిన గైడ్లు తిరగేశారు.
Family members help students cheat during Bihar Board exams in Hajipur, Bihar. pic.twitter.com/JEULT48MQC
— ANI (@ANI_news) March 19, 2015 జవాబులు గుర్తించి వాటిని చింపి తీసుకు వెళ్లారు. మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు అని తేడా చూడకుండా భవనం ఎక్కి స్లిప్ లు కిటికిలలో నుండి లోపలికి విసిరేశారు. స్లిప్పులు చూసి పరిక్షలు వ్రాస్తున్న విద్యార్థులను ఇన్విజిలేటర్ (పర్యవేక్షణాధికారి) రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్నారు. అయినా విద్యార్థుల దగ్గర పరిక్షలు వ్రాయించి ఇంటికి పంపించారు.
young child saunters into exam hall where Bihar Board exams are taking place, with answers in papers for students pic.twitter.com/BsU8ej24xq
— ANI (@ANI_news) March 19, 2015 











Click it and Unblock the Notifications