పఠాన్‌కోట్: సల్వీందర్ సింగ్‌కు లై డిటెక్టర్ పరీక్ష

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌కు మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) హెడ్‌క్వార్టర్స్‌లో లైడిటెక్టర్‌ పరీక్ష నిర్వహించారు. సల్వీందర్‌ సింగ్‌ను ఎన్‌ఐఏ పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

ఇటీవల పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి సల్వీందర్‌ సింగ్‌ను అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను ప్రశ్నించినట్లు ఎన్‌ఐఏ డీజీ తెలిపారు.

Pathankot attacks probe: Gurdaspur SP Salwinder Singh undergoes lie-detector test

పఠాన్‌కోట్‌ ఉగ్ర దాడికి ముందు సల్వీందర్‌ సింగ్‌తో పాటు మరో ఇద్దరిని ఉగ్రవాదులు అపహరించారు. ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన తర్వాత సల్వీందర్‌ని విచారించిన అధికారులకు ఆయన చెప్పిన పొంతన లేని సమాధానాలు పలు అనుమానాలకు తావిచ్చాయి. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+