నగదు కోసం బ్యాంకు కు వెళ్తే చచ్చేలాకొట్టాడు (వీడియో)
ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేనగర్ బ్యాంకు వద్ద జనంపై కానిస్టేబుల్ విచక్షణరహితంగా కొట్టడం వివాదాస్పదమైంది. క్యూ లైన్ ను కాదని బ్యాంకులోనికి వచ్చే వారి పట్ల కానిస్టేబుల్ గొడ్డును బాదినట్టు బాదాడు.
ఫతేపూర్ :పెద్ద నగదు నోట్ల రద్దుతో నగదు మార్పిడి కోసం, కొత్త నగదు కోసం బ్యాంకుకు వెళ్ళిన ప్రజలకు చుక్కలు చూపించారు కానిస్టేబుల్. బ్యాంకు వద్ద సక్రమంగా క్యూ లైన్ కోసం దొరికినవారిని దొరికినట్టుగా లాఠీతో చితకబాదాడు. కానిస్టేబుల్ వ్యవహరశైలిని పలువురు తప్పుబడుతున్నారు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ బ్యాంకు వద్ద ఈ ఘటన చోటచేసుకొంది.నగదు మార్పిడి కోసమో, నగదును డ్రా చేసుకొనేందుకు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు ఖాతాదారులు వచ్చారు.
బ్యాంకులోనికి ఒకరి తర్వాత వెళ్ళేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. లైన్ తప్పి వచ్చారనే కారణంగా కొందరిపై పోలీస్ కానిస్టేబుల్ విచక్షణరహితంగా కొట్టాడు. బ్యాంకు లోనికి వెళ్ళేందుకు ఆశపడిన ఖాతాదారులకు కానిస్టేబుల్ చుక్కలు చూపించాడు.
విచక్షణ రహితంగా కానిస్టేబుల్ కొట్టడంతో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వృద్దులు ,మహిళలు ఉన్నారనే విషయాన్ని కూడ చూడకుండా కానిస్టేబుల్ తన ప్రతాపం చూపాడు.












Click it and Unblock the Notifications