ice cream: పండుగ రోజు ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ లో చచ్చిన కప్ప, ఆసుపత్రిలో !
సాంబర్ లో బల్లి, రసంలో రిల్లలు, బిరియానీలో దోమలు ఇలా చెప్పకుంటూ వెళితే హోటల్స్ లో ఏదో ఒకటి ఆహారంలో ఒకటి బయటపడుతూనే వస్తున్నది. ఇప్పుడు ఐస్ క్రీమ్ ల వంతు వచ్చేసింది. ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకుని తిన్న కుటుంబ సభ్యుల
చెన్నై/కన్యాకుమారి: వ్యాపారం చేస్తున్న కొంత మంది ఏదిపడితే అది అమ్మేసి డబ్బులు సంపాధించాలని అనుకుంటున్నారు. సాంబర్ లో బల్లి, రసంలో రిల్లలు, బిరియానీలో దోమలు ఇలా చెప్పకుంటూ వెళితే హోటల్స్ లో ఏదో ఒకటి ఆహారంలో ఒకటి బయటపడుతూనే వస్తున్నది. ఇప్పుడు ఐస్ క్రీమ్ ల వంతు వచ్చేసింది.
తమిళనాడులోని మధురైలోని టీవీఎస్ నగర్ నగర్ సమీపంలోని మణిమేగల వీధిలో అంబు సెల్వం అలియాస్ సెల్వం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తైపూస పర్వదినాన్ని పురస్కరించుకుని సెల్వం ఆయన తన కుటుంబ సభ్యులు, సోదరుడి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపరంగున్రం ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. మా కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని సెల్వం దేవుడిని ప్రార్థించుకున్నాడు.

ఉదయం 11 గంటల ప్రాంతంలో గుడి సమీపంలోని చిరుతిళ్ల దుకాణంలో పిల్లలతో కలిసి వెళ్లాడు. పిల్లలు ఐస్ క్రీమ్ తినాలని సెల్వంకు చెప్పారు. పిల్లలకు సెల్వం ఐస్ క్రీమ్ తీసి ఇచ్చాడు. పిల్లలు ఐస్ క్రీమ్ తినడం ప్రారంభించగా అందులో చనిపోయిన కప్ప కనిపించింది. ఇది చూసిన సెల్వం కూతురు తన తండ్రికి ఐస్ క్రీమ్ లో కప్ప ఉందని చెప్పింది.
ఐస్ క్రీమ్ లో కప్ప పడి ఉండడం చూసి షాక్ తిన్న సెల్వం అతని కుటుంబీకులతో పాటు ఐస్ క్రీమ్ తిన్న చిన్నారులను చికిత్స నిమిత్తం సమీపంలోని తిరుపరంగుంరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందించారు. తిరుపరంగుంరం సుబ్రమణ్య స్వామి ఆలయానికి తైపూసం కోసం లక్షలాది మంది భక్తులు వెళ్లారు.
స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న చిరుతిళ్ల దుకాణంలో అపరిశుభ్రమైన ఐస్‌క్రీమ్ విక్రయించడం, ఐస్‌క్రీమ్ లో కప్ప ఉండటంతో అంతకు ముందు ఐస్ క్రీమ్ తిన్న ప్రజలు ఆసుపత్రికి పరుగు తీశారు. ఐస్ క్రీమ్ విక్రయించిన షాప్ యాజమాన్యం మీద తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వారిని వదిలిపెట్టకూడదని బాధితుడు సెల్వం సంబంధిత అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications