చెన్నైలో పెట్రోల్, డీజీలు ధరల పెరుగుదల, వ్యాట్ ధరలను పెంపు కారణమా?
తమిళనాడు రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.3.78, డీజీల్ పై రూ.1.78 పెరిగాయి. వ్యాట్ ట్యాక్స్ ధరలను సమీక్షించడంతో పెట్రోల్ , డీజీల్ ధరలు పెరిగాయి.
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.3.78, డీజీల్ పై రూ.1.78 పెరిగాయి. వ్యాట్ ట్యాక్స్ ధరలను సమీక్షించింది తమిళనాడు ప్రభుత్వం.దీంతో వ్యాట్ టాక్స్ ను పెంచాలని నిర్ణయం తీసుకొంది. కొత్త ధరలను తక్షణమే అమల్లోకి వచ్చాయి.
వ్యాట్ ధరలను తమిళనాడు ప్రభుత్వం సమీక్షించింది.అయితే వ్యాట్ ధరలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకొంది. పెట్రోల్ పై లీటర్ కు రూ.3.78 , డీజీల్ పై రూ.1.78 పెంచాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.
అయితే ఈ ధరల పెంపును పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ధరల పెంపుతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని అసోసియేషన్ అభిప్రాయపడింది.

వ్యాట్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పెట్రోల్ పై 27 శాతం ఉన్న వ్యాట్ ను 34 శాతానికి, డీజీల్ పై 21.4 శాతం ఉన్న వ్యాట్ ను 25 శాతానికి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు కూడ పెరిగే అవకాశం ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు కెపీ మురళి అభిప్రాయపడ్డారు.వ్యాట్ ధరల పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.75 కు చేరింది.












Click it and Unblock the Notifications