PM Kisan: రైతులకు శుభవార్త.. మీ వద్దకే అధికారులు..!
కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్ఠాత్మకంగా పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింది రూ.6 వేలు అందిస్తున్నారు. నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 16 విడతలుగా రూ.32 వేలు అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. త్వరలో 17వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఈ కేవైసీ చేసుకున్న అన్నదాతలకే డబ్బులు వస్తున్నాయి.
దీంతో ఈకేవైసీ చేసుకోలేని వారికి డబ్బులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం రైతులు ఈ కేవైసీ చేసుకోవడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది.జూన్ 5 నుంచి జూన్ 15 వరకు PM కిసాన్ సాచురేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందడానికి ఈ డ్రైవ్ ఉపయోగపడనుంది. ఈ డ్రైవ్ లో ఈ కేవైసీ చేసుకోలేని రైతులు ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు పొందవచ్చు.

ఈ కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్ లో కూడా చేసుకోవచ్చు. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ రైట్ సైడ్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈ కేవైసీ, నో యూవరు స్టేటస్ ఉంటుంది. మీరు ఈ కేవైసీపై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఆధార్ ఆధారిత ఓటీపీ వస్తుందని దాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. అదే ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సడ్మిట్ చేయాలి. అంతే ఈ కేవైసీ పూర్తి అయిపోతుంది.
లేకుంటే మీ సమీప CSC (కామన్ సర్వీస్ సెంటర్) లేదా రాష్ట్ర సేవా కేంద్రాన్ని సందర్శించాలి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ( జూన్ 4 ఆ) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత విడుదల అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 16వ విడతను ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications