టెక్ సీఈఓతో మోడీ భేటీ: ఎవరేమన్నారు?(ఫోటోలు)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీపై సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ దిగ్గజాలు ప్రశంసలు జల్లు కురిపించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా ప్రముఖ సంస్థల సీఈవోలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ దిగ్గజాలు ప్రధాని మోడీ దార్శనికత, ముందుచూపులను కొనియాడారు. మోడీ కలల స్వప్నమైన డిజిటల్ ఇండియా సాకారానికి తామంతా సహకరిస్తామని, అయితే, ఇండియాలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని వారంతా కోరారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబ్ కంపెనీల ప్రతినిధులు తమ ప్రసంగాల్లో ఇదే నర్మగర్భంగా ప్రస్తావించారు. త్వరితగతిన అనుమతులు, పన్ను ప్రోత్సాహకాలు ఉంటే మరిన్ని కంపెనీలు పెట్టుబడులతో దేశానికి వస్తాయని వారు సూచించారు.
PM Narendra Modi and top Tech CEOs at the Digital India dinner #ModiInUSA pic.twitter.com/tmJAstVJ6E
— ANI (@ANI_news) September 27, 2015 We want to help people make things and make things happen-Satya Nadella,Microsoft CEO #ModiInUSA pic.twitter.com/uKgLklMeVh
— ANI (@ANI_news) September 27, 2015 We are extremely excited and motivated with PM Modi's digital India vision-Paul E Jacobs,Executive Chairman,Qualcomm pic.twitter.com/D17XhDHixY
— ANI (@ANI_news) September 27, 2015 He(PM Modi) has accelerated India's efforts in becoming the hotbed of innovation-Sundar Pichai,Google CEO #ModiInUSA pic.twitter.com/c9uMqK1U0l
— ANI (@ANI_news) September 27, 2015 You(PM Modi) are an amazing ambassador of your country-John Chambers,Executive Chairman of Cisco Systems #ModiInUSA pic.twitter.com/nwsw87Dxg7
— ANI (@ANI_news) September 27, 2015 
భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర: గూగుల్ సీఈవో సుందర్ పిచ్చై
టెక్నాలజీ విభాగంలో భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ సాంకేతికత దేశాభివృద్ధికి ఎంతో అవసరమని ప్రధాని మోడీ గుర్తించారన్నారు. భారత్‌లో 3వేలకు పైగా స్టార్టప్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అన్ని భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు అందిస్తున్నామన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించటంలో భారత్ ముందుందన్నారు. త్వరంలో భారత్‌లో విద్యార్థులకు క్రోమ్ బుక్స్ అందుబాటులోకి తెస్తామన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాల స్కైప్ ద్వారా తరగతులు: సత్య నాదేళ్ల
శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించటం నిజంగా అద్భుతమని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రశంసించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్ బాండ్ సదుపాయం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రాపవుట్స్ వివరాలు తెలుసుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారన్నారు. చిన్న వ్యాపారులకు క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రపంచంలోని ప్రజలందరి సాధికారత దిశగా పని చేసేందుకు ఇది సమయమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

మొబైల్ టెక్నాలజీ మన జీవితాలనే మార్చేస్తోంది: క్వాల్‌కామ్ సీఈవో పాల్ జాకబ్స్
మొబైల్ టెక్నాలజీ మన జీవితాలనే మార్చేస్తోందని క్వాల్‌కామ్ సీఈవో పాల్ జాకబ్స్ అన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాల్ జాకబ్స్ మాట్లాడుతూ భారత్‌లో ప్రస్తుతం 121 మిలియన్ల వైర్‌లెస్ బ్రాండ్‌బాండ్ వినియోగదారులు ఉన్నారన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో భారత్ అతిపెద్ద మార్కెట్ అని వివరించారు.

భారత్‌లోని అపార మార్కెట్ తమ సంస్థకు అత్యంత ప్రధానం: టిమ్ కుక్
అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఓ ఆసక్తికర విషయాన్ని మోడీకి వివరించారు. యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఇండియా పర్యటనల రహస్యాన్ని ఆయనకువ వివరించారు. భారత్ కు వెళ్లి వస్తే ఎంతో ప్రేరణ పొందవచ్చని, ఆ కారణంతోనే స్టీవ్ ఇండియా పర్యటనలు జరిపేవారని అన్నారు. ఇండియాతో తమకు ఎంతో అనుబంధముందని, భారత్‌లోని అపార మార్కెట్ తమ సంస్థకు అత్యంత ప్రధానమని, డిజిటల్ ఇండియాకు తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications