Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్, పాక్‌లను ఒకే త్రాసులో తూచలేం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ

PM Modi in BRICS Summit: బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని.. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారత్‌కు మద్దతు ఇచ్చిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడంలో వెనుకాడకూడదని.. ఉగ్రవాద బాధితులు, మద్దతుదారులను ఒకే త్రాసులో తూకం వేయలేమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని భారత ఆత్మ, గుర్తింపు, గౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి కేవలం భారత్‌కు మాత్రమే కాదు.. మానవాళికి ఎదురుదెబ్బ అని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఖండించడం మన బాధ్యత అంటూ పేర్కొన్నారు.

శాంతియుతమైన, సురక్షితమైన వాతావరణంలో మాత్రమే మానవాళి అభివృద్ధి సాధ్యమని.. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో బ్రిక్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యంగా ఉండాలన్నారు. భారత్ అన్ని స్నేహపూర్వక దేశాలతో సహకారం, భాగస్వామ్యానికి కట్టుబడి ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ కూటమి గ్లోబల్ సౌత్ అంచనాలను అందుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత్ వ్యవసాయం, ఆరోగ్యం, పాలన విద్య వంటి రంగాలలో ఏఐని విస్తృతంగా ఉపయోగిస్తోందని ప్రధాని వెల్లడించారు.

PM Modi Slams Pakistan at BRICS Victims and Sponsors of Terror Can t Be Equated

మోడీ కీలక ప్రసంగం..
బ్రిక్స్ సదస్సులో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "భారత్ ఉగ్రవాద బాధిత దేశమని.. పాకిస్థాన్ దానికి మద్దతుదారు అని.. కాబట్టి బాధితులు, మద్దతుదారులను ఒక స్థాయిలో తూచలేమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. వ్యక్తిగత లేదా రాజకీయ లాభాల కోసం ఉగ్రవాదం వ్యాప్తికి వ్యతిరేకంగా మాట్లాడని లేదా చర్యలు తీసుకోని వారిని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదులకు మౌన సమ్మతి ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని ఎత్తి చూపారు.

రియో డి జనీరో డిక్లరేషన్:
బ్రిక్స్ కూటమి దేశాలు 'రియో డి జనీరో డిక్లరేషన్' పేరుతో సంయుక్త ప్రకటనను చేశాయి. ఈ ప్రకటన 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిచింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దాని ప్రేరణ ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరు పాల్పడినా అద నేరమేనని, అన్యాయమేనని తీవ్రంగా ఖండించింది. సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులను, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని, వారికి సురక్షిత స్థావరాలు కల్పించడాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటామని బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.

బ్రిక్స్ 2026 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
భారతదేశం 2026లో బ్రిక్స్ సదస్సును నిర్వహించనుంది, ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై తన నిబద్ధతను, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశంగా నిలుస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+