అల్లర్లలో లీడర్లు చనిపోలేదు: అఖిలేష్‌పై రాహుల్ ఫైర్

Rahul Gandhi
లక్నో: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం అఖిలేష్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గంలోని ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. యుపిలో కొన్ని రాజకీయ శక్తులు హిందువులను, ముస్లింలను రాజకీయ లబ్ధి కోసం విడగొడుతున్నాయని ఆరోపించారు.

ప్రతి సాధారణ వ్యక్తి అల్లర్లను కోరుకోరని, ప్రశాంతంగా జీవించడమే కోరుకుంటారని కానీ కొన్ని రాజకీయ శక్తులు విడదీస్తున్నాయన్నారు. అల్లర్ల ఘటనలో రాజకీయ నాయకులు ఎవరు చనిపోలేదని, పేదవారు, అమాయకులే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రజల కోసం, పేదవారి కోసం, వారి హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు.

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం పని చేస్తోందా అని మండిపడ్డారు. ఉపాధి లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారని విమర్శించారు. యూపిఏ ప్రభుత్వం ఆహార భద్రత, విద్య, ఉద్యోగం తదితరాల పైన ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు.

ఆహార భద్రత బిల్లును పార్లమెంటులో అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించినా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆ బిల్లు కోసం పోరాడారన్నారు. ఈ బిల్లు ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తిండి లేక దేశంలో ఎవరు బాధపడకూడదన్నారు.

యూపిఏ ప్రవేశ పెట్టిన ఆహార భద్రత బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అమలుపర్చడం లేదని, ప్రజలు అఖిలేష్ ప్రభుత్వాన్ని దీనిపై నిలదీయాలని సూచించారు. పదేళ్ల పాలనలో తామేం చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని కానీ పేదవారి సమస్యలు వారికేం తెలుసునన్నారు. ఆకలి అనేదే పెద్ద సమస్య అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+