Power: మీ గుడ్డిబిల్డప్ నాలుగు రోజులు మాత్రమే, మా రాజు వస్తాడు, మీకథ చూస్తాం, లేడీ లీడర్ దెబ్బతో సంజయ్ కి!
ముంబాయి/ న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి అత్యంత సన్నిహితుడు, ఠాక్రే కుటుంబానికి నమ్మనిబంటు, శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం చేసిన ట్వీట్ తో రాజకీయాలు మరితవేడెక్కాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది, మహారాష్ట్ర విధాన సభ (అసెంబ్లీ)ని రద్దు చేసే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్ చేశారు. సంజయ్ రౌత్ ట్విట్ చెయ్యకముందే ముంబాయికి చెందిన బీజేపీ లేడీ కార్పోరేటర్ శివసేన ఎంపీకి షాక్ ఇచ్చారు.
మీ గుడ్డిబిల్డప్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది, మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, త్వరలో మారాజు రంగంలోకి వస్తారు అంటూ రాసిన ఫ్రెక్సీలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంటి ముందు కట్టడం కలకలం రేపింది. మీ కథ క్లోజ్ అనే టైపులో బీజేపీ లేడీ కార్పోరేటర్ పేరు, ఆమె ఫోటోలతో కట్టిన బ్యానర్ చూసిన శివసేన నాయకులు షాక్ అయ్యారు. అయితే తన ఇంటి ముందు కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

కలకలం రేపిన సీఎం అనుచరుడి ట్విట్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తరువాత శివసేన పార్టీలో నోరు ఎత్తి గట్టిగా పార్టీ గురించి మాట్లాడే వ్యక్తి సంజయ్ రౌత్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి అత్యంత సన్నిహితుడు, ఠాక్రే కుటుంబానికి నమ్మనిబంటు, శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం చేసిన ట్వీట్ తో రాజకీయాలు మరితవేడెక్కాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది, మహారాష్ట్ర విధాన సభ (అసెంబ్లీ)ని రద్దు చేసే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్ చేశారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాము, అయితే ఫలితం మాత్రం కనిపించడం లేదని, అందుకే అసెంబ్లీని రద్దు చెయ్యాలని మా నాయకుడు ఉద్దవ్ ఠాక్రే ఆలోచిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పరోక్షంగా హింట్ ఇచ్చారు.

ఎంపీకి షాక్ ఇచ్చిన లేడీ కార్పోరేటర్
సంజయ్ రౌత్ ట్విట్ చెయ్యకముందే ముంబాయికి చెందిన బీజేపీ లేడీ కార్పోరేటర్ దీపామాలా బఢే శివసేన ఎంపీకి షాక్ ఇచ్చారు. మీ గుడ్డిబిల్డప్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది, మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, త్వరలో మారాజు రంగంలోకి వస్తారు అంటూ బీజేపీ లేడీ కార్పోరేటర్ దీపామాలా పేరుతో రాసిన ఫ్రెక్సీలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంటి ముందు కట్టడం కలకలం రేపింది.

సైలెంట్ అయిపోయిన టాప్ లీడర్
సంజయ్ రౌత్ పేరుతో ఆయన్ను ఉద్దేసించి రాసిన బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఇక మీ కథ క్లోజ్ అనే టైపులో బీజేపీ లేడీ కార్పోరేటర్ దీపామాలా పేరు, ఆమె ఫోటోలతో కట్టిన బ్యానర్ చూసిన శివసేన నాయకులు షాక్ అయ్యారు. అయితే తన ఇంటి ముందు కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో, బీజేపీ నాయకుల తీరు విషయంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆ లెక్కలు నిజం అయితే?
శివసేన పార్టీ రెబల్ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే మాకు 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటున్నారు. అయితే 25 మంది శివసేన ఎంపీలు సీఎం ఉద్దవ్ ఠాక్రే వెంట ఉన్నారని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే లెక్కలు నిజం అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసే అవకాశం కొందరు శివసేన నాయకులు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications