'జయలలితకు గుండెపోటు ఊహించలేదు, ఆనవాళ్లే కనిపించలేదు'

జయలలితకు గుండెపోటు ఊహించలేదని, ఆమెకు అలాంటి ఆనవాళ్లే కనిపించలేదని అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు.

చెన్నై: జయలలితకు గుండెపోటు ఊహించలేదని, ఆమెకు అలాంటి ఆనవాళ్లే కనిపించలేదని అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. ఎక్మోతో చాలామంది బతికారని, ఆమె విషయంలో మాత్రం సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జయలలిత ఈ నెల 5వ తేదీన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఒకటి రెండు రోజులు మినహా ఆమెకు అందిస్తున్న చికిత్సలన్నింటిని తాను దగ్గర ఉండి పర్యవేక్షించానని చెప్పారు. కానీ ఆమెకు గుండెపోటు వస్తుందని తామెవరం ఊహించలేకపోయామన్నారు.

Prathap C Reddy says they never thought that Jayalalithaa will get heart attack

తాను రెండు నెలల పాటు చెన్నైని వదిలిపెట్టి లేనని చెప్పారు. తమ శక్తికి మించి చేయాల్సిన చికిత్సలను అన్నింటిని అందించామన్నారు. జయలలిత మరణానికి కొద్ది రోజులముందు అత్యవసర పనులపై తాను హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చిందని, బయలుదేరేముందు ఆమెను పలకరించానని చెప్పారు.

ఆమె ముఖంపై అదే చిరునవ్వు కనిపించిందని, ఆ సమయంలో టీవీ చూస్తున్నారని తెలిపారు. దగ్గరగా వెళ్లి హైదరాబాద్‌నుంచి తిరిగి వచ్చేలోపు మీరు లేచి నడుస్తారని చెప్పానని అన్నారు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక ఆమెను డిశ్చార్జి చేద్దామని నిర్ణయించామన్నారు.

ఆ తర్వాత జయకు గుండెపోటు వచ్చిందని తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. హృద్రోగ శస్త్ర చికిత్స వైద్యనిపుణుడొకరు ఆమెను నిరంతరం పరిశీలిస్తున్నా గుండెపోటు రావడంతో ఆవేదన చెందానని, ఎందుకంటే అప్పటిదాకా ఆమెలో అలాంటి ఆనవాళ్లే కనబడలేదన్నారు.

గుండెపోటు రాగానే ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆమెకు చికిత్స అందించిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలు చేపట్టామన్నారు. ఆమె చికిత్స పొందుతున్న గదికి సమీపంలోనే ఎక్మో విభాగం ఉందని, వెంటనే ఆమెకు ఆ పరికరాన్ని అమర్చినట్లు తెలిపారు.

గత సెప్టెంబరు 22న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చికిత్సలకు బాగా స్పందించిన జయలలిత, అనారోగ్యం సృష్టించిన బాధలన్నిటినీ తట్టుకుని ధైర్యాన్ని ప్రదర్శించారని, తనను చూసినప్పుడల్లా చిరునవ్వు నవ్వేవారన్నారు. ఆమె అసాధారణ మహిళ అని, ఆమె కోపంలోను న్యాయం దాగి ఉంటుందన్నారు. అందరిలో ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+