సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గౌహతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ముర్మ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలిసారి సుఖోయ్-30 ఎంకేఐ(Sukhoi-30) యుద్ధ విమానంలో ప్రయాణించారు. శనివారం ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్నారు.

రాష్ట్రపతి తొలుత భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్లయింగ్ సూట్ ధరించి సుఖోయ్-30 విమానంలో కొద్దిసేపు విహరించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు.

President Droupadi Murmu Flies In Fighter Jet Sukhoi 30 From AssamsTezpur

మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత గురువారం అస్సాం చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్ ఉత్సవ్ ను ఆమె ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మౌంట్ కాంచనగంగ సాహాసయాత్ర-2023ను రాష్ట్రపతి ప్రారంభించారు. శనివారం సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+