కారుకు నిప్పంటించుకుని పూజారి ఆత్మహత్య
బెంగళూరు: జీవితంపై విర్తకి చెందిన అర్చకుడు కారులో కుర్చకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని కంగేరి ఉపనగరలో నివాసం ఉంటున్న శివశంకర్ హెబ్బార్ (45) ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉడిపికి చెందిన శివశంకర్ హెబ్బార్ బెంగళూరు చేరుకుని కంగేరి ఉపనగరలో భార్య అనుపమా, కుమారుడు ద్రువతో కలిసి నివాసం ఉంటున్నారు. మైసూరు-మాగడి రింగ్ రోడ్డులోని మరియప్పనపాళ్య లోని అమ్మ ఆశ్రమం రోడ్డులో ఉన్న శ్రీ శనీశ్వర స్వామి దేవాలయంలో శివశంకర్ పూజారిగా పని చేస్తున్నాడు.

గురువారం దేవాలయంలో పూజలు చేసి ఇంటికి వెళ్లాడు. ఉదయం 10.45 గంటల సమయంలో స్నేహితుడిని కలిసి వస్తానని భార్య అనుపమకు చెప్పి తన మారుతి-800 కారులో బయటకు వెళ్లాడు. తరువాత కంగేరి సమీపంలోని విశ్వేశ్వరయ్య లేఔట్ దగ్గర ఉన్న నైస్ రోడ్డు దగ్గరకు వెళ్లాడు.
కారును సమీపంలోని పొలంలో పార్క్ చేశాడు. అదే కారులో కుర్చున్న శివశంకర్ హెబ్బార్ మీద పెట్రోల్ పోసుకుని డోర్ లాక్ చేసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కారులో నుండి పొగలు వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చేలోపు శివశంకర్ మరణించాడు. మృతదేహాన్ని రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు. శివశంకర్ హెబ్బార్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నామని కంబలగూడు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications