సెక్యూరిటీకి ప్రియాంక గాంధీ స్లిప్: అమేథీలో ప్రచారం
అమేథీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ గురువారంనాడు అమేథీలో తన భద్రతా సిబ్బంది వదిలేసి ప్రచారానికి వెళ్లారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీలో ఆమె ప్రచారం సాగిస్తున్న విషయం తెలిసిందే. విస్తృతమైన భద్రతా సిబ్బంది కోసం నిరీక్షించకుండా ప్రియాంక గాంధీ గురువారం ఉదయం అమేథీలో ర్యాలీకి వెళ్లినట్లు సమాచారం.
ప్రియాంకా గాంధీకి పటిష్టమైన భద్రత ఉంటుంది. అందులో చాలా మంది సిబ్బంది ఉంటారు. జామర్లతో డజను వాహనాలు, అంబులెన్స్, వైద్య బృందం ఉంటాయి. ప్రియాంకా గాంధీ తన మార్గాన్ని కూడా మార్చినట్లు సమాచారం. ఆమెకు ప్రత్యేక రక్షణ గ్రూప్ లేదా ఎస్పీజి రక్షణ ఉంటుంది. ఆ సిబ్బంది లేకుండా ఆమె 20 నిమిషాల పాటు ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను వెంటాడారు. చివరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆమెను పట్టుకోగలిగారు. దీంతో ఎస్పీజి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచారం సందర్భంగా భద్రత ప్రజలతో కలవడానికి పెద్ద ఇబ్బంది మారిందనే అసంతృప్తితో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.
తనతో మాట్లాడడానికి, తనను కలవడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నవారిని ఎస్పీజీ దూరంగా నెట్టేస్తున్న పద్ధతి ఆమెకు నచ్చలేదని అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం ఎస్పీజికి చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications