Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘దేశం విడిచిపో’: సన్నీ‌లియోన్‌కి వ్యతిరేకంగా ధర్నా

న్యూఢిల్లీ: బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘దేశం విడిచిపో.. భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను కలుషితం చేయకు' అని సన్నీకి వ్యతిరేకంగా పలువురు ఢిల్లీలోని ప్రముఖ ధర్నా ఘాట్ జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టారు.

ఇండో కెనెడియన్ అయిన సన్నీలియోన్ ఇంతకుముందు పోర్న్ స్టార్‌గా సుపరిచితురాలైంది. జిస్మ్2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. కాగా, ఇటీవల ఆమె నటించిన కండోమ్ వాణిజ్య ప్రకటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ‘సన్నీ లియోన్ దేశం విడిచి వెళ్లిపో.. నా దేశసభ్యత, సంస్కారాలను మంటకలపకు' అనే పోస్టర్‌తో పలువురు ధర్నా చేపట్టారు. కండోమ్ వాణిజ్య ప్రకటనలో సన్నీ లియోన్ నటించడంపై సిపిఐ నేత అతుల్ కుమార్ అంజన్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Protest against Sunny leone

సన్నీ చేసిన ఆ వాణిజ్య ప్రకటనతో అత్యాచారాలు పెరుగుతాయని ఆయన అన్నారు. అయితే, ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై సన్నీ లియోన్ ఘాటుగానే స్పందించారు.

రాజకీయ నేతలు అనవసర విషయాలతో తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. ‘నాపై దృష్టి పెట్టకుండా ప్రజా సేవకు తమ కాలాన్ని వినియోగించాలి' అని అంజన్‌ను ఉద్దేశించి సన్నీ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, జంతర్ మంతర్ వద్ద ధర్నా ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+