వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫాంహౌస్ ముట్టడి: కరుణానిధి కుమార్తెకు కావేరీ సెగ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కావేరీ జలాల రగడ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి కుటుంబ సభ్యులకు తగిలింది. కావేరీ జలాల పంపిణి విషయంలో స్పందించాలని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాలు కరుణానిధి కుమార్తె సెల్వీ ఫాం హౌస్ ను ముట్టడించారు.

బెంగళూరు-మైసూరు రహదారిలోని రామనగర సమీపంలో కరుణానిధి కుమార్తె సెల్వీ ఫాం హౌస్ ఉంది. మంగళవారం మద్యాహ్నం కన్నడ సంఘాల నాయకులు, కార్యకర్తలు సెల్వీ ఫాం హౌస్ నుముట్టడించడానికి ప్రయత్నించారు.

Protests erupt outside the farmhouse of Selvi

విషయం తెలుసుకున్న పోలీసులు ఫాం హౌస్ దగ్గర గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. కావేరీ జలాల పంపిణి విషయంపై కరుణానిధి కుటుంబ సభ్యులు స్పంధించాలని డిమాండ్ చేస్తూ వారు ఫాం హౌస్ ముందు నినాదాలు చేశారు.

కరుణానిధి, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు గుప్పించారు. బెంగళూరు ప్రజలకు తాగడానికి నీళ్లు లేవని, మండ్య, మైసూరు జిల్లాల రైతులు నీళ్లు లేక అల్లాడుతున్నారని, ఇప్పుడు తమిళనాడుకు కావేరీ నీళ్లు ఎలా వదాలాలి అని ప్రశ్నించారు. ఇదే సందర్బంలో తమిళనాడు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

English summary
Protests erupt outside the farmhouse of Selvi, the daughter of former Tamil Nadu Chief Minister Karunanidhi near Ramnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X