ఉప ఎన్నికల్లో ముఖ్య మంత్రి ఘన విజయం
న్యూఢిల్లీ/ చెన్నై/ పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అక్కడి ముఖ్యమంత్రి వీ. నారాయణస్వామి అన్నాడీఎంకే అభ్యర్థిపై విజయం సాధించారు. పుదుచ్చేరిలోని నెల్లితోప్ప అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.
పుదుచ్చేరీ ముఖ్యమంత్రి నారాయణస్వామి తన ప్రత్యర్థి, అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్ పై 11,151 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత మే 16 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించారు.
అయితే ఆయన శాసన సభ్యుడు కాకపోవడంతో ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యవలసి వచ్చింది. గత శనివారం పుదుచ్చేరిలో ఉప ఎన్నికలు జరిగాయి. నారాయణస్వామి తప్పకుండా గెలువాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఫలితాలపై అన్నాడీఎంకే, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరికి అక్కడి సీఎం నారాయణస్వామి విజయం సాధించారు.

అదే విధంగా దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతాల్లో నాలుగు లోక్ సభ ఎన్నికలకు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. త్రిపురలోని బర్జాలా అసెంబ్లీ నియోజక వర్గంలో సీపీఎం విజయం సాధించింది. కోవాయి అసెంబ్లీ నియోజక వర్గంలో సీపీఎం విజయం సాధించింది.
తమిళనాడులోని మూడు శాసన సభ నియోజక వర్గాల్లో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులు విజయం దిశగా ముందు దూసుకు వెలుతున్నారు. రెండు లోక్ సభ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్ లోని నేపనగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మంజు దాదు 42,198 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పెద్ద నోట్ల రద్దు తరువాత వెలువుడున్న ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications