Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. దిగువ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahu Gandhi)కి పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోడీ ఇంటిపేరు పరువునష్టం కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై పాట్నా హైకోర్టు మే 15 వరకు స్టే విధించింది. 'మోడీ ఇంటిపేరు'పై రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై 2019లో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ పరువు నష్టం దావా వేశారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 12న హాజరుకావాలని పాట్నా దిగువ కోర్టు కాంగ్రెస్ నాయకుడిని కోరింది.
పరువు నష్టం కేసులో దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ గాంధీ ఏప్రిల్ 22 న పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పాట్నా హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. పరువు నష్టం కేసు ఇప్పటికే సూరత్ కోర్టులో విచారణలో ఉన్నప్పుడు, అదే విషయంలో వేరే కోర్టులో మరో విచారణ సరికాదని కోర్టు పేర్కొంది. ఇది చట్టవిరుద్ధంమని పేర్కొంది. తదుపరి విచారణను మే 15కి వాయిదా వేయడంతో పాటు అప్పటి వరకు దిగువ కోర్టు విచారణలన్నీ నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ విషయంపై వాదనను కొనసాగించాలని కోర్టు తమను కోరిందని సుశీల్ మోడీ తరఫు న్యాయవాది ఎస్‌డి సంజయ్ చెప్పారు. రాహుల్ గాంధీని ఇప్పటికే సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత లోక్‌సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ప్రొటోకాల్స్ ప్రకారం శనివారం ఆయన తన అధికారిక తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి గెలుపొందిన తర్వాత ఆయనకు తొలిసారిగా బంగ్లా కేటాయించారు.
కాంగ్రెస్ నాయకుడు తన బంగ్లాను ఖాళీ చేసి, ఢిల్లీలోని తల్లి సోనియా గాంధీ నివాసానికి వెళ్లాడు. నిజం మాట్లాడినందుకు మూల్యం చెల్లిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పాడు. కర్ణాటకలోని కోలార్‌లో 2019లో రాహుల్ గాంధీ మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications