దారుణం.. తనపై రంగు చల్లొద్దన్నందుకు యువకుడ్ని చంపేశారు!

దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు శుక్రవారం హోలీ సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనపై రంగులు చల్లోద్దంటూ వారించిన ఓ 25 ఏళ్ల యువకుడిని ముగ్గురు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

హన్సరాజ్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అదే సమయంలో అశోక్, బబ్లు, కలురామ్ అనే ముగ్గురు హోలీ ఆడుకుంటూ అతని వెళ్లారు. అయితే, తనపై రంగులు చల్లవద్దని ఆ ముగురిని హన్సరాజ్ వేడుకున్నాడు.

Rajasthan Man killed for not throwing paint on himself

అయినప్పటికీ వినకుండా అతడిపై రంగు చల్లడంతోపాటు దాడికి పాల్పడ్డారు. బెల్తుతో అతడ్ని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితుల్లో ఒకడు.. హన్సరాజ్ గొంతునులిమి చంపాడని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.

ఈ ఘటన అనంతరం బాధితుడు కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు వారంతా జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు హన్సరాజ్ కుటుంబానికి రూ. 50 లక్షల నగదు, ఆ కుటుంబంలోని ఓ వ్యక్తికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నుంచి హామీ లభించడంతో హైవేపైనుంచి హన్సరాజ్ మృతదేహాన్ని తొలగించి ఆందోళనను విరమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+