టీఎంసీకి షాక్: బీజేపీలో చేరిన ఐదుగురు నేతలు, ఆహ్వానించిన అమిత్ షా..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. టీఎంసీ- బీజేపీ పోటాపోటీగా అడుగులు వేస్తున్నాయి. బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోసారి అధికారం చేపడుతామనే ధీమాలో టీఎంసీ ఉండగా.. ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవాలని కమల దళం అనుకుంటోంది. ఈ క్రమంలోనే మాటల యుద్ధం/ వరస పర్యటనలు జరుగుతున్నాయి.

టీఎంసీ పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన రెబల్స్‌కు బీజేపీ వెల్ కం చెప్పింది. వారు ఇవాళ హోం మంత్రి అమిత్ షాతో సుధీర్ఘ చర్చలు జరిపారు. తర్వాత అమిత్ షా నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజీవ్ బెనర్జీ, బైషాలీ దాల్మియా, ప్రబీర్ గోషాల్, రతిన్ చక్రవర్తి, రుద్రనిల్ ఘోష్ టీఎంసీకి బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఈ మేరకు అమిత్ షా ట్వీట్ చేశారు. వీరి చేరికతో బీజేపీ బలం మరింత పెరిగిందని ఆయన చెప్పారు. బెంగాల్ బంగారం మార్చేందుకు ఇది ఉపయోగపడుతోందని ట్వీట్ చేశారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో రాజీబ్ బెనర్జీ ఇదివరకు మంత్రిగా పనిచేశారు. ఆయన ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. రాజీబ్ సహా ప్రబీర్, బైషాలీని ఇటీవల పార్టీ నుంచి టీఎంసీ బహిష్కరించింది. రతిన్ చక్రవర్తి మాజీ హౌరా మేయర్ అనే సంగతి తెలిసిందే. దీంతో వీరంతా కలిసి ఢిల్లీ వచ్చి.. సీనియర్ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరితో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, యాక్టర్ రుద్రాణి ఘోష్ కూడా ఉన్నారు. వీరిని బీజేపీ ఉపాధ్యక్షులు ముకుల్ రాయ్, జాతీయ కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ ఢిల్లీ తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications