ఐఏఎఫ్‌లోకి మరో అస్త్రం: తేలికపాటి విమానాలు, వీటి ప్రత్యేకతలివే
భారత వాయుసేనలోకి తేలికపాటి చాపర్లు చేరనున్నాయి. రేపు (సోమవారం) రాజస్థాన్ జోధ్‌పూర్‌లో జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారు. ఇవీ తేలికపాటి హెలికాప్టర్లు అని.. దీనికి సంబంధించి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇవీ ఐఏఎఫ్‌కు బూస్ట్ ఇచ్చే అంశం అని ఆయన తెలిపారు.

తేలికపాటి విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేశాయి. ఇవీ ఎలాంటి పరిస్థితులోనైనా పనిచేయగలవు. ఈ విమానాలు 5 వేల అడుగుల ఎత్తులో కూడా ఆయుధాలు, ఇంధనం అందించగలవు. తేలికపాటి విమానాలు కావడంతో వేగంగా దాడి చేయగలవని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
నిర్దేశిత ఎత్తులో, 24 గంటలు పనిచేసే సామర్థ్యం ఈ హెలికాప్టర్ల సొంతం. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొగలుగుతాయని వైమానిక దళం చెబుతుంది. భారత వైమానిక దళం, భారత సైన్యం అవసరాలను తీర్చడానికి ఇవీ చక్కగా పనిచేస్తాయని విశ్లేషిస్తోంది. ఈ తేలికపాటి విమానాలు ఐఏఎఫ్‌లో చేరికతో వాయుసేన మరింత బలోపేతం కానుంది.












Click it and Unblock the Notifications