కేంద్ర మాజీ మంత్రి నన్ను రేప్ చేశాడు, చంపేస్తాడంట !
నోయిడా: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ ప్రధాన్ మీద హత్యాయత్నం, లైంగికదాడి కేసు నమోదు చేశారు. నోయిడాకు చెందిన మహిళ (29) కేంద్ర మాజీ మంత్రి మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు.
అశోక్ ప్రధాన్ తో పాటు ఆ మహిళ తన మామ (భర్త తండ్రి), పంకజ్ జిందాల్ అనే ఇద్దరి మీద ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తనను రేప్ చేశారని ఆమె ఆరోపించారు.
మా ఇంటిలోనూ, మరో చోట అశోక్ ప్రధాన్ తన మీద లైంగిక దాడి చేశాడని ఆమె పోలీసులకు చెప్పారు. ఈ విషయం బయటకు చెబితే నిన్ను హతమారుస్తామని అశోక్ ప్రధాన్ బెదిరించారని ఆమె ఆరోపించారు.

11 నెలల క్రితం తనకు వివాహం అయ్యిందని, అత్తమామల ఇంటికి వెళ్లిన తరువాత తనకు కష్టాలు మొదలైనాయని ఆమె ఆరోపిస్తున్నారు. తన భర్త తాగుడుకు బానిస అయ్యాడని, అదే అదును చూసుకుని తన మామ సహాయంతో అశోక్ ప్రధాన్ తనను రేప్ చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్తతో సహ తన కుటుంబ సభ్యులు తనను వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. బాధితురాలికి అశోక్ ప్రధాన్ వివాహం చేశారు. ఈ విషయంపై అశోక్ ప్రధాన్ స్పందిస్తూ రాజకీయ దురుద్దేశంతో తన మీద ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.
ఆమె చేసిన ఆరోపణలు కొట్టిపారేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమె మీద పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అశోక్ ప్రధాన్ నాలుగు సార్లు ఎంపీగా ఎన్నిక అయ్యారు. వాజ్ పేయి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. తరువాత ఆయన బీజేపీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications