మత మార్పిడి ఈవెంట్ ఎఫెక్ట్: మంత్రి పదవికి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన మంత్రి పదవికి ఆదివారం రాజీనామా చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నందుకు బీజేపీ తీవ్ర నిరసనల నేపథ్యంలో గౌతమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
'ఈ రోజు మహర్షి వాల్మీకి జీ అభివ్యక్తి దినం, మరోవైపు ఇది మాన్యవర్ కాన్షీ రామ్ సాహెబ్ వర్ధంతి కూడా. అటువంటి యాదృచ్ఛికంగా, ఈ రోజు నేను అనేక సంకెళ్ళ నుంచి విముక్తి పొందాను. నేను మళ్లీ పుట్టాను. ఇప్పుడు నేను ఎలాంటి ఆంక్షలు లేకుండా మరింత దృఢంగా సమాజ హక్కులు కోసం, దౌర్జన్యాలపై పోరాడుతూనే ఉంటాను అని రాజీనామా అనంతరం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు రాజేంద్ర పాల్ గౌతమ్.

గుజరాత్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ విమర్శల నేపథ్యంలో గౌతమ్‌తో తన మంత్రి పదవికి రాజీనామా చేయించిందని తెలుస్తోంది.
आज महर्षि वाल्मीकि जी का प्रकटोत्सव दिवस है एवं दूसरी ओर मान्यवर कांशीराम साहेब की पुण्यतिथि भी है। ऐसे संयोग में आज मैं कई बंधनों से मुक्त हुआ और आज मेरा नया जन्म हुआ है। अब मैं और अधिक मज़बूती से समाज पर होने वाले अत्याचारों व अधिकारों की लड़ाई को बिना किसी बंधन के जारी रखूँगा pic.twitter.com/buwnHYVgG8
— Rajendra Pal Gautam (@AdvRajendraPal) October 9, 2022
ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుమారు 10వేల మంది బౌద్ధ మతం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రిగా ఉన్న రాజేంద్రపాల్ గౌతమ్ కూడా పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో హిందూ మతానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. హిందూ దేవీ దేవతలను పూజించకూడదని ప్రమాణం చేశారు. హిందు మతానికి వ్యతిరేక ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు విమర్శల దాడి ఎక్కుపెట్టారు. గుజరాత్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను చించేసి నిరసనలు తెలిపారు.












Click it and Unblock the Notifications