ఏడు రాష్ట్రాల్లో నమోదైన పోలీంగ్ 59.70 శాతం.. మిగిలి ఉన్న మరో 59 స్థానాలు
ఆరవ విడత ఎన్నికలు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఆరవ విడతలో భాగంగా ఏడు రాష్ట్ర్రాల్లోని 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. దీంతో సాయంత్రం అయిదు గంటలరకు పోలీంగ్ ముగియడంతో క్యూలో నిలబడ్డవారికి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటి వరకు మొత్తం 483 స్థానాలకు ఎన్నికలు పూర్తవ్వగా మే 19న జరగనున్న ఏడవ దశల ఎన్నికల్లో మిగిలిన 59 స్థానాలకు పోలీంగ్ జరగనుంది.

మొత్తం ఏడు రాష్ట్ర్రాలు 59 స్థానాలు...
కాగా నేడు జరిగిన ఎన్నికల్లో బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానాలోని అన్ని స్థానాలకు 6వ విడతలోనే పోలింగ్ జరగగా. బీహార్‌లో ఎనిమిది లోకసభ స్థానాలు, ఢిల్లీ లో ఏడు స్థానాలు, హర్యానాలో పది స్థానాలు, జార్ఖండ్‌లో నాలుగు స్థానాలు, మధ్యప్రదేశ్‌లో ఎనిమిది స్థానాలకు, ఉత్తర్ ప్రదేశ్‌లో పద్నాలుగు స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ పూర్తయింది. కాగా వీరిలో మొత్తం 979 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

నేడు రాష్ట్ర్రాల వారిగా నమోదైన పోలింగ్ శాతాలు...
సాయంత్రం నాలుగు గంటలవరకు మొత్తం స్థానాల్లో 59.70 శాతం పోలీంగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.కాగా పశ్చిమ బెంగాల్‌లో 80.13 ,హరియాణలో 62.14 ,మధ్యప్రదేశ్ 60.12 ఉత్తరప్రదేశ్ 50.82, జార్ఖండ్ 64.46 ఢిల్లిలో 55.44 శాతం కాగా బిహార్ 55.04 శాతం ఓట్లు నమోదయ్యాయి.

ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
ఆరవదశ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తోపాటు ఉపరాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడు దంపతులు నిర్మాణ్ భవన్ పోలీంగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఢల్లిలోనే యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధి, ఏఐసిసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి,తోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధిలు తమ ఓటును వినియోగించుకున్నారు.కాగా నిర్మాణ్ భవన్ లోనే ఎయిర్ చీఫ్ దనోవా తోపాటు మాజీ రాష్ట్ర్రపతి ప్రణబ్ ముఖర్జి, ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఆరోరా ,సీనియర్ కమ్యూనిస్ట్ నేత ప్రకాశ్ కారత్ ,క్రికెటర్ కపిల్ , విరాట్ కోహ్లి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షీత్ తోపాటు బోపాల్ బీజేపీ అభ్యర్థి,వివాదాలకు కేంద్రబిందువయిన సాధ్వి ఠాకూర్ లతోపాటు ఆయా రాష్ట్ర్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు
నేడు జరిగిన ఎన్నికల్లో కూడ పశ్చిమ బెంగాల్ లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. బంకురా నియోజకవర్గంలోని పోలింగ్ నెంబర్ 254లో బీజేపీ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. టీఎంసీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపణలు చేసింది. కాగా అయిదు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కూడ పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు. అయినా బెంగాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త వాతవరణం నెలకొంది.

ఘటాల్ లోక్‌సభ పరిధిలో ఉద్రిక్తత...
మరోవైపు ఘటాల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంత బీజేపీ అభ్యర్థి భారతీఘోష్‌పై తృణమూల్ మహిళా కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆమెను చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో భారతి మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా.. అక్కడ కూడా స్థానిక మహిళలు అడ్డుకోవడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈలోగా భారతి వాహనంపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీని వెనుక టీఎంసీ కార్యకర్తల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే భారతీ ఘోష్ సెల్‌ఫోన్‌తో పోలింగ్ బూత్‌లోకి ప్రయత్నించి వీడియో తీసే ప్రయత్నం చేశారని టీఎంసీ ఆరోపించింది. దీనిపై ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications