నవీన్ పట్నాయక్‌తో మమతా బెనర్జీ భేటీ: మీడియాతో ఏం చెప్పారంటే.?
భువనేశ్వర్: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలో ఒక్కటయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒడిశా పర్యటనలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఒడిశా సీఎం, బీజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు.
2024లో ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, మమత బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమికి నవీన్ పట్నాయక్ మద్దతు కోరినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంపై ఇద్దరు సీఎంలు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

భేటీ అనంతరం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. దేశ సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన విధానంపై ఇరువురం చర్చించామన్నారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అన్నారు. రాజకీయపరమైన అంశాల గురించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని నవీన్ పట్నాయక్ వెల్లడించారు.
ఈ భేటీ కేవలం సాధారణ బేటీ మాత్రమేనని.. దీని వెనుక ఎలాంటి రాజకీయ పరమైన ఉద్దేశాలు లేవని మమతా బెనర్జీ కూడా స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం కొత్త ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా సమదూరం పాటించాలని నిర్ణయించారు. అంతేగాక, రాహుల్ గాంధీపై మమతా నేరుగా విమర్శలు చేశారు. బీజేపీ గెలుపునకు రాహుల్ గాంధీనే సహకరిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. కాగా, కొత్త ఫ్రంట్ గురించి చర్చించేందుకు శుక్రవారం మమతతో జేడీయూ నేత కుమారస్వామి కోల్‌కతాలో సమావేశం కానున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications