పెళ్లికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు. అర్వల్లీ జిల్లా శ్యామ్ లాజీ చెక్ పోస్టు వద్ద ట్యాంకర్, జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
జీపులో ఉన్న 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. జీపులోని ప్రయాణికులు పెళ్లికి హాజరై వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

కాబూల్ నుంచి ఢిల్లీకి భారతీయుల మృతదేహాలు
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో గురువారం ఒక గెస్ట్ హౌజ్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో మృతిచెందిన నలుగురు భారతీయుల మృతదేహాలు శుక్రావరం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్నాయి. గురువారం జరిగిన ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా 14 మంది విదేశీయులు మృతిచెందారు.












Click it and Unblock the Notifications