షాకింగ్: ఇందిరా గాంధీ ఎమర్జెన్సీకి ఆరెస్సెస్ సమర్థన!
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ అధిపతి టివి రాజేశ్వర్ సోమవారం షాకింగ్ అంశం చెప్పారు. అత్యయిక స్థితి కాలంలో చేపట్టిన పలు చర్యలను అప్పట్లో ఆరెస్సెస్ సమర్థించిందని ఆయన చెప్పారు.
ఆ సమయంలో ఆరెస్సెస్ అధిపతిగా ఉన్న బాలాసాహెబ్ దేవరస్ అప్పటి ప్రదాని ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీతో మాట్లాడేందుకు ప్రయత్నించారని చెప్పారు.
అత్యయిక స్థితికి ఆరెస్సెస్ మద్దతు ఇచ్చిందంటూ రాజేశ్వర్ రాసిన పుస్తకం 'ది క్రూషియల్ ఇయర్స్'లోని కొన్ని భాగాలపై ఓ ఇంటర్వ్యూలో కరణ్ థాపర్ ఆయనను ప్రశ్నించారు. అత్యయిక స్థితి విధించిన కాలంలో రాజేశ్వర్ ఐబీ డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు.

ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఆరెస్సెస్ మద్దతు ఇవ్వచూపిందని రాసిన భాగాలపై ప్రశ్నించగా.. ఇందిర, సంజయ్ గాంధీని కలవడానికి చేసిన ప్రయత్నాలు ఇందుకే అని ఆయన అభిప్రాయపడ్డారు.
అత్యయిక స్థితి కాలంలో ఏం జరుగుతుందో ఇందిరకు తెలుసని, అది ప్రజలపై ఎంత ప్రభావం చూపుతుందో, పర్యవసానాలేమిటో గ్రహించలేకపోయి ఉండవచ్చన్నారు. అత్యయిక స్థితిని ప్రతిపాదించింది సిద్ధార్థ్ శంకర్ రే అన్నారు.












Click it and Unblock the Notifications