రచ్చరచ్చ: ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నిప్పు, సీపీఐ (ఎం) ర్యాలీపై నాటు బాంబులతో దాడి!
కణ్ణూరు/కొచ్చి: కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వెయ్యకున్నా భగ్గుమంటోంది. తాజాగా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నిప్పటించడంతో పరిస్థితులు చెయ్యిదాటి పోయాయి.
ప్రతీకారంతో సీపీఐ(ఎం) నాయకులపై నాటు బాంబులతో దాడులు చేశారు. కేరళలోని కణ్ణూరు జిల్లాలోని పయ్యణ్ణూరు లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నిప్పంటించారు.
నిప్పంటించడంతో ఆర్ఎస్ఎస్ కార్యాలయం పూర్తిగా కాలిపోయి బూడిద అయ్యింది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ లేరని పోలీసులు అంటున్నారు. సీపీఐ (ఎం) కార్యకర్తలు కార్యాలయానికి నిప్పటించారని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

గత సంవత్సంర జులై 12వ తేదీన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సీపీఐ (ఎం) కార్యకర్త ధనరాజ్ ను హత్య చేశారని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ధనరాజ్ పుణ్యతిథి సందర్బంలో బుధవారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్బంలో సీపీఐ (ఎం) నాయకుల మీద మూడు నాటు బాంబులు విసిరారు.
ఈ బాంబుల దాడిలో నలుగురు సీపీఐ (ఎం) కార్యకర్తలకు గాయాలైనాయి. బీజేపీ నాయకులే మా మీద బాంబులు విసిరారని సీపీఐ (ఎం) నాయకులు ఆరోపించారు. ఈ రెండు ఘటనలు జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఆర్ఎస్ఎస్, బీజేపీ, సీపీఐ (ఎం) కార్యకర్తలు కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కణ్ణూరు జిల్లాలో కేరళ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications