Russia-Ukraine Crisis: భారతీయుల తరలింపు కోసం భారత ప్రత్యామ్నాయ మార్గాలు
న్యూఢిల్లీ: రష్యా దాడులతో ఉక్రెయిన్ దేశంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారతీయులు తమను స్వదేశానికి తీసుకురావాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే వేలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చింది. ఇంకా సుమారు 16వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. ఉక్రెయిన్ గగనతలంలో ప్రవేశాలు నిలిపివేయడంతో భారత్ విమానాలు ఆ దేశానికి వెళ్లలేకపోతున్నాయి.

రొమేనియా రాజధానికి భారత విమానాలు
ఈ నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్ సమీప దేశాలకు తరలించి అక్కడ్నుంచి విమానాల ద్వారా స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు రెండు విమానాలను నడపాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది అని పీటీఐకి సంబంధిత అధికారులు తెలిపారు.అదే విధంగా, ముంబై మరియు ఢిల్లీ నుంచి వరుసగా రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలు వెళ్లనున్నాయి.

హంగేరిలోని బుడాపెస్ట్‌కు భారత విమానాలు
ఈరోజు రొమేనియాలోని బుకారెస్ట్‌కు రెండు విమానాలు, శనివారం హంగేరిలోని బుడాపెస్ట్‌కు ఒక విమానాన్ని భారత ప్రభుత్వ చార్టర్డ్ విమానాలుగా నడపాలని ప్లాన్ చేస్తున్నట్లు ఏఎన్ఐకి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం భారత ప్రభుత్వం తరలింపు విమానాలను ఏర్పాటు చేస్తుందని ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఉక్రెయిన్‌పై రష్యా చర్యను ఖండిస్తున్న ప్రపంచ దేశాలు
రష్యాతో కొనసాగుతున్న వివాదం మధ్య, యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధ వ్యతిరేక సంకీర్ణానికి విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి రష్యా-ఉక్రెయిన్ వివాదంలో సుమారు 68 మంది మరణించినందున ఈ విజ్ఞప్తి వచ్చింది, అని ఏఎఫ్‌పీ నివేదించింది. సమర్థవంతమైన అంతర్జాతీయ సహాయం కోసం Zelenskyy పిలుపునిచ్చారు. చర్చల పట్టికలో రష్యాను ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తన పోలిష్ కౌంటర్ ఆండ్రెజ్ డుడాతో ఇదే విషయాన్ని చర్చించినట్లు చెప్పారు. "రక్షణ సహాయం, ఆంక్షలు, దురాక్రమణదారుపై ఒత్తిడి కోసం బుకారెస్ట్ నైన్‌కు విజ్ఞప్తి చేశారు," అన్నారాయన. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఖండించారు.
Recommended Video

ఉక్రెయిన్‌పై దాడులకు వ్యతిరేకంగా రష్యాలోనూ నిరసనలు
అంతేగాక, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూకుడుకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు పెరుగుతున్నాయి. వార్తా సంస్థ ఏఎఫ్‌పీ ప్రకారం, ఉక్రెయిన్‌పై పుతిన్ చర్యను నిరసిస్తున్న 1,700 మందికి పైగా ప్రజలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రష్యా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన వ్యతిరేక చట్టం ఉన్నప్పటికీ, సెంట్రల్ మాస్కోలోని పుష్కిన్ స్క్వేర్ దగ్గర అనేక వేల మంది ప్రజలు గుమిగూడి రష్యా మిలిటరీ చర్యను నిరసించారు. ఒక్క మాస్కోలోనే 900 మందికి పైగా అరెస్టు చేయగా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 400 మందిని అరెస్టు చేశారు. రష్యాలోని 53 నగరాల్లో నిరసనకారులు ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపారు. ఉక్రెయిన్ అంతటా 11 ఏరోడ్రోమ్‌లతో సహా 74 సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications