శబరిమల ప్రసాదం ఇకనుంచి ఒక్కో భక్తుడికి 2 టిన్నులు మాత్రమే..
కేరళలోని శబరిమల ఆలయం ఎంత ప్రత్యకమైనదో. అక్కడి ప్రసాదం కూడా అంతే ప్రత్యేకమైనది. శబరిమల ప్రసాదాన్ని ప్రత్యేకంగా డబ్బాలలో ఇస్తుంటారు. ఈ ప్రసాదం ఒక్కో భక్తుడికి పది టిన్నులు అందించేది. ఇప్పడు ఆ అయ్యప్ప ప్రసాదానికే కొరత ఏర్పడింది. ఇప్పుడు ఆ డబ్బాలకు కొరత ఏర్పడడంతో ప్రసాదం డబ్బాలపై ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కొన్ని ఆంక్షలను విధించింది. దీంతో ఒక్కో అయ్యప్ప భక్తుడికి కేవలం 2 టిన్నులే ప్రసాదాన్ని అందిస్తామని దేవస్థానం బోర్డు పేర్కొనడం జరిగింది.
శబరిమల ప్రసాదం అంతకుముందు ఒక్కో భక్తుడికి పది టిన్నుల వరకూ ఇచ్చేది. ఇప్పుడు ఆ సంఖ్యను పూర్తిగా తగ్గించింది. దీనికి కారణం శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడం, మకరజ్యోతి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు విచ్చేసే తరుణంలో అరవణ ప్రసాదంపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థానం అయ్యప్ప ప్రసాదంపై తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు 2 డబ్బాలు ఏమాత్రం సరిపోవు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బాల కొరత, ప్రసాద పంపిణీకి అనేక చిక్కులు తెచ్చిపెడుతోంది. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు రెండు టిన్నుల ప్రసాదం అస్సలు సరిపోదు. ఒకదాన్ని అక్కడే తింటారు. మరోకటి ఇంటికి తీసుకువెళ్తారు. బంధువులు, చుట్టుపక్కల వారికి ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది...:ఈ సంవత్సరం శబరిమలకు భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఆలయం దగ్గర విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. కిలోమీటర్ల మేరా క్యూ లైన్ ఉంటోంది. సంక్రాంతి మకరజ్యోతి వరకు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డబ్బాల వాడకం కూడా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అందరికీ ప్రసాదం అందేలా దేవస్థానం బోర్డు ఒక్కో భక్తుడికి రెండు టిన్నుల ప్రసాదం మాత్రమే అందించాలని నిర్ణయం తీసుకుంది. దేవస్థానం బోర్డు గత సంవత్సరం 26వ తేదీన 2 కొత్త కంపెనీలకు ప్రసాదం డబ్బాల కాంట్రాక్ట్‌ను ఇచ్చింది. అయితే అంత మొత్తంలో కంపెనీ అరవణ ప్రసాదం డబ్బాలను అందించలేకపోయింది. దీంతో డబ్బాల కొరత ఏర్పడింది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని దేవస్థానం బోర్డు వెల్లడించింది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications