ఆ 9 నిమ్మకాయలకు రూ.68వేలు, కారణమిదే!..
చెన్నై:తమిళనాడులోని మురుగన్ ఆలయంలో నిర్వహించిన వేల పాటలో 9 నిమ్మకాయలు రూ,68,100 పలికాయి. అయితే పదిరోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించిన నిమ్మకాయలను తింటే సంతానం కలుగుతోందని భక్తుల నమ్మకం.
విల్లుపురం జిల్లా ఒట్టనందల్ గ్రామంలోని పురాతన రత్నవేల్ మురుగన్ ఆలయంలో ఏా పది రోజుల పాటు కావడి ఉత్సవాలను నిర్వహిస్తారు.

పదిరోజుల పాటు మురుగన్ వద్ద శూలానికి గుచ్చి ఉండే 9 నిమ్మకాయలను వేలం వేస్తారు. మంగళవారం జరిగిన ఈ వేలం పాటలో తొలి నిమ్మకాయను రూ.27 వేల కు ఓ భక్తుడు కొన్నాడు. రెండవ, మూడవ నిమ్మకాయలు రూ.6 వేలకు కొనుగోలు చేశారు.
నాలుగోది రూ,5,800, ఐదోది రూ,6,300, ఆరోది,రూ.5 వేలు, 7వది రూ,5600 ఎనిమిదోది రూ.3,700 ,తొమ్మిదోది రూ,2,700లకు కొనుగోలు చేశారు.ఈ నిమ్మకాయలను దక్కించుకొన్న వ్యక్తి భార్య మరుసటి రోజు గింజలతో తింటే సంతానం కలుగుతోందని భక్తుల విశ్వాసం.












Click it and Unblock the Notifications