డ్రగ్స్ కేసు : ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కొన్నాళ్లే... కానీ... సుశాంత్‌పై సారా అలీ ఖాన్ ఆరోపణ...

బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఇప్పటికే హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్,దీపికా పదుకొణే,శ్రద్దా కపూర్,సారా అలీ ఖాన్‌లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) విచారించడంతో... దానికి సంబంధించిన లీకులు బయటకొస్తున్నాయి. ఎన్‌సీబీ విచారణలో సుశాంత్‌తో రిలేషన్‌ షిప్ గురించి సారా అలీ ఖాన్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

సుశాంత్‌పై సారా ఆరోపణ...

సుశాంత్‌పై సారా ఆరోపణ...

ఆ కథనం ప్రకారం... సుశాంత్‌,తాను కొన్నాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సారా అలీ ఖాన్ ఎన్‌సీబీ విచారణలో అంగీకరించింది. కేదార్‌నాథ్ సినిమా సమయంలో తమ మధ్య ఆ సాన్నిహిత్యం ఏర్పడినట్లు తెలిపింది. అయితే సుశాంత్‌తో తన బంధం కొన్నాళ్లే సాగినప్పటికీ... ఆ కొద్దిపాటి రిలేషన్‌షిప్‌లోనూ అతను తన పట్ల అంత నమ్మకంగా వ్యవహరించలేదని ఆరోపించింది. సుశాంత్‌తో కలిసి థాయిలాండ్ టూర్‌తో పాటు పలుమార్లు లోనవాలా ఫామ్ హౌస్‌లో పార్టీలకు వెళ్లినట్లు చెప్పింది.

ఆ సినిమా బోల్తా కొట్టడంతో బ్రేకప్...

ఆ సినిమా బోల్తా కొట్టడంతో బ్రేకప్...

తాను సిగరెట్లు తాగుతానని,అయితే డ్రగ్స్‌కు మాత్రం దూరమని విచారణలో సారా వెల్లడించింది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను తోసిపుచ్చింది. అదే సమయంలో సుశాంత్ మాత్రం పలు సందర్భాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపింది. సుశాంత్-సారా రిలేషన్‌పై కేదార్‌నాథ్ సమయంలోనే బాలీవుడ్ కోడై కూసింది. కానీ ఈ ఇద్దరు ఎక్కడా దానిపై నోరు విప్పలేదు. తాజా విచారణలో సారా దానిపై నోరు విప్పినప్పటికీ... సుశాంత్‌ తనతో అంత నమ్మకంగా లేడని అతని వ్యక్తితత్వంపై పరోక్షంగా విమర్శలు చేయడం గమనార్హం. సుశాంత్ నటించిన సోంచిరియా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సారా అతనికి బ్రేకప్ చెప్పారన్న ప్రచారం బాలీవుడ్‌లో ఉన్నది.

అక్కడ తరుచూ పార్టీలు...

అక్కడ తరుచూ పార్టీలు...

ఇదే కేసుపై జగదీష్ దాస్ అనే ఓ బోట్‌మ్యాన్ మాట్లాడుతూ.... లోనవాలాలోని తన ఫామ్ హౌస్‌కు సుశాంత్ తరుచుగా వచ్చేవాడని చెప్పారు. అక్కడ తరుచూ పార్టీ చేసుకునేవారని... హీరోయిన్లు రియా చక్రవర్తి,శ్రద్దా కపూర్,సారా అలీ ఖాన్ కూడా అక్కడికి వచ్చేవారని చెప్పారు. ఇప్పటికే అరెస్టయిన డ్రగ్స్ విక్రేత జైద్ విలత్రా కూడా అక్కడికి వచ్చేవారని చెప్పారు. ఆ పార్టీల్లో మందు,గంజాయి చాలా కామన్‌గా ఉండేవారన్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో రియా చక్రవర్తి,ఆమె సోదరుడు షోయిక్ సహా ఎన్‌సీబీ 18 మందిని అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి కస్టడీని బాంబే కోర్టు అక్టోబర్ 6వరకు పొడగించింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+