శశికళ 10ఏళ్ల పాటు పోటీకి అనర్హురాలు: సీఎం పీఠం కోసం.. పళనిస్వామి ఫ్యాక్స్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే అధినేత్రి, చిన్నమ్మ శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెకు శిక్ష నాలుగేళ్ల పడినప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం పదేళ్ల పాటు పోటీ చేయకూడదు.
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే అధినేత్రి, చిన్నమ్మ శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెకు శిక్ష నాలుగేళ్ల పడినప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం పదేళ్ల పాటు పోటీ చేయకూడదు.
సుప్రీం తీర్పు నేపథ్యంలో శశికళ పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అయ్యారు. దీంతో ఆమె ముఖ్యమంత్రి పీఠం కలగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం తీర్పు వెలువడగానే శశికళ నిర్ఘాంతపోయారు. కంటతడి పెట్టుకున్నారు.
మరో మూడున్నరేళ్లు జైలు శిక్ష
శశికళకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆమె గతంలోనే ఈ కేసుకు సంబంధించి ఆరు నెలల శిక్ష అనుభవించడంతో మరో మూడున్నరేళ్లు జైల్లో ఉండబోతున్నారు.

ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులుగా ఉన్న జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా ప్రకటించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అప్పుడు శశికళ బెంగళూరులోని అగ్రహార జైల్లో దాదాపు ఆర్నెల్ల పాటు శిక్ష అనుభవించారు.
ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సమర్థిస్తూ సుప్రీం దోషులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అప్పుడు అనుభవించిన శిక్షను కూడా పరిగణలోకి తీసుకోవడంతో చిన్నమ్మతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లు మరో మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించవలసి వలసి ఉంటుంది.
అప్పుడు అనుభవించిన శిక్షను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో చిన్నమ్మతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లు మరో మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమెకు అర్హత లేదు.
ఇక అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. వెంటనే శశికళ లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
దీంతో ప్రస్తుతం శశికళ బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్‌కు భారీగా పోలీసులు చేరుకున్నారు. డీజీ స్థాయి అధికారులతో పాటు, మూడు ప్రత్యేక బస్సుల్లో వచ్చిన పోలీసులు రిసార్ట్‌లోకి వెళ్లారు. కొంత సమయం కావాలని శశికళ తరఫు న్యాయవాదులు పోలీసు ఉన్నతాధికారులను అభ్యర్థించారు. శశికళను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.
గవర్నర్‌కు పళని స్వామి ఫ్యాక్స్
శశికళ జైలుకు వెళ్తుండటం, పన్నీరు సెల్వంపై చిన్నమ్మ వర్గం వేటు వేసి పళని స్వామి పేరును ముఖ్యమంత్రి రేసులో తెరపైకి తీసుకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు మంగళవారం ఫ్యాక్స్ చేశారు.
శశికళకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలే ఇప్పుడు పళని స్వామికి మద్దతిస్తున్నారు. దీంతో ఆయన గవర్నర్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల లిస్టును ఫ్యాక్స్ చేశారు. ఇప్పుడు శశికళ స్థానంలో పళని స్వామి బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications