లొంగిపోతాను, 4 వారాల టైం ఇవ్వండి: సుప్రీంకు శశికళ, మరో ఆప్షన్ కూడా..
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా తనకు నాలుగు వారాల పాటు సమయం ఇవ్వాలని ఆమె సుప్రీం కోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా తనకు నాలుగు వారాల పాటు సమయం ఇవ్వాలని ఆమె సుప్రీం కోర్టును కోరనున్నారు.
అనారోగ్యం కారణంగా తనకు కోర్టులో లొంగిపోయేందుకు గడువు కావాలని శశికళ కోరనున్నారు. ముందు మరో ఆప్షన్ కూడా ఉంది. గడువుకు న్యాయస్థానం ఒకే చెబితే.. ఆ తర్వాత ఆమె రివ్యూ పిటిషన్ వేసే అవకాశముంది.

కాగా, శశికళను సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో రాష్ట్రంలో అందరి దృష్టి నాలుగు ప్రాంతాల పైన పడింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నివాసం ఒకటైతే, జయలలిత మేనకోడలు దీప నివాసం రెండోది. మూడోది పోయెస్ గార్డెన్ కాగా, నాలుగోది తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో శశికళ నిర్వహిస్తున్న గోల్డెన్ బే రిస్టార్స్.
శశికళకు శిక్ష ఖరారు కావటంతో అపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం, జయలలిత మేనకోడలు దీప నివాసాలతో పాటు ప్రతిపక్ష డీఎంకే కార్యాలయం, స్టాలిన్ ఇళ్ల వద్ద సంబరాలు జరుపుకున్నారు.
పన్నీర్ సెల్వం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. దీప ఇంటి వద్ద కూడా ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమెకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.
మరోవైపు, శశికళ నివాసముంటున్న దివంగత జయలలిత ఇల్లు పొయెస్ గార్డెన్‌లోని వేదనిలయం నిర్మానుష్యంగా మారిపోయింది. కోర్టు తీర్పు తర్వాత అక్కడున్న కొద్ది మంది కార్యకర్తలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. శశికళపై కోర్టు తీర్పు తర్వాత అన్నాడీఎంకే పార్టీ ట్విటర్ ద్వారా స్పందించింది. అమ్మ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు శశికళ తన వెంటే ఉన్నారని, ఇప్పుడు కూడా అదే జరగుతుందని అన్నాడీఎంకే ట్వీట్ చేసింది. అమ్మ స్వచ్ఛత ద్రోహుల వల్ల నాశనమైందని పేర్కొంది.












Click it and Unblock the Notifications