ఇప్పుడు శశికళ ఏం చేయవచ్చు?: 'తమిళనాడుకు ప్రేమికుల రోజు గిఫ్ట్'
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఆమె ఏం చేయనున్నారనే చర్చ సాగుతోంది. ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఆమె ఏం చేయనున్నారనే చర్చ సాగుతోంది. ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ఇప్పుడు ఆమె ముందు ఉన్న ఆప్షన్ రివ్యూ పిటిషన్ అని చెబుతున్నారు. అక్రమాస్తుల కేసులో సుప్రీం తనను దోషిగా ప్రకటించిన నేపథ్యంలో.. చిన్నమ్మ రివ్యూ పిటిషన్ వేయవచ్చునని చెబుతున్నారు.
శశికళ ముఖ్యమంత్రి పీఠం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆస్తుల కేసులో గతంలోనే ఆమె ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు. నాలుగేళ్ల జైలు శిక్ష పడినందున మరో మూడున్నరేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది.

జైలు జీవితం పక్కన పెడితే.. ఈ నేరానికి గాను ఆమె పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ నేపథ్యంలో ఆమె రివ్యూ పిటిషన్ వైపు మొగ్గు చూపుతారని అంటున్నారు.
ట్విట్టర్లో చురకలు
'సుప్రీం తీర్పుతో అన్నాడీఎంకే పార్టీ ప్రజలు సంబరపడుతున్నారు. కానీ ఇదే కేసులో జయ ప్రధాన నిందితురాలని మర్చిపోయారు. ఆమే ప్రాణాలతో ఉంటే జైలుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు శశికళ బందీ అయ్యారు, ఎమ్మెల్యేలు విడుదల పొందారు. జయలలిత ఆత్మ ఏమనుకుంటుందో? కానీ కచ్చితంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరలేదని చెప్పగలను. సుప్రీం తీర్పు శశికళ తలరాత జయ ఆత్మకు శాంతి కలుగచేస్తాయని' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
ప్రేమికుల రోజున తమిళనాడు ప్రజలకు సుప్రీం అందించిన ఉత్తమమైన బహుమతి అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ప్రజలు ఎప్పటిలాగే ఊపిరి పీల్చుకుని ఎటువంటి భయం లేకుండా ఉండవచ్చునని పేర్కొన్నారు.
అవినీతికి పాల్పడినందుకు శశికళ దోషిగా మారారని, జయలలిత మృతికి కూడా ఆమె సమాధానం చెప్పాలని, రెండు కేసులకు సమానంగా తీర్పు ఇవ్వలేదని, అమ్మకు న్యాయం జరగాలని గౌతమి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications