పార్టీకి పన్నీర్ విధేయుడుగా లేడు, గవర్నర్ స్పందించాల్సిందే, శశికళ సంచలన వ్యాఖ్యలు
అన్నాడిఎంకె చీఫ్ శశికళ పన్నీర్ సెల్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీని చీల్చేందుకు పన్నీర్ కుట్రపన్నారని ఆమె ఆరోపించారు. ఏనాడు కూడ పార్టీకి విధేయుడిగా లేడన్నారు..
చెన్నె:తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై అన్నాడిఎంకె చీఫ్ శశికళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీని చీల్చేందుకు పన్నీర్ సెల్వం కుట్రపన్నారని ఆమె ఆరోపించారు.తమిళనాడు సంక్షోభంపపై గవర్నర్ స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
సోమవారం నాడు ఆమె చెన్నెలో మీడియాతో మాట్లాడారు. అన్నాడిఎంకె చీల్చేందుకు సాగుతున్న కుట్రలను తాను సాగనివ్వబోనని ఆమె ప్రకటించారు.జయలలిత చనిపోయినప్పుడే పార్టీని చీల్చేందుకు కుట్ర పన్నారని తెలిసిపోయిందని ఆమె చెప్పారు.

అన్నాడిఎంకె పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలపై ఆమె వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వం ఏనాడు కూడ పార్టీకి విధేయుడిగా లేడని ఆమె చెప్పారు.జయలలిత అంతిమ సంస్కారాలు సాగుతున్నప్పుడే పార్టీని చీల్చేందుకు కుట్రపన్నారనే విషయం తెలిసిందన్నారు.
పన్నీర్ సెల్వం జయలలితకు ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. అన్నాడిఎంకెను చీల్చేందుకు కుట్రలు సాగుతున్నాయని, వాటిని సాగనివ్వబోనని ఆమె ప్రకటించారు.పన్నీర్ సెల్వం పార్టీకి ఏనాడు కూడ విదేయుడుగా లేడని ఆమె చెప్పారు.
తమిళనాడులో సంక్షోభానికి డిఎంకె బిజెపిలు కారణమని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు తనకు సరిపోను ఎంఏల్ఏల మద్దతు ఉందని ఆమె మరోసారి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications