తీర్పుతో నిర్ఘాంతపోయిన శశికళ.. ఆగని కన్నీళ్లు!, జైలుకు వెళ్లే యోచన
సుప్రీం తీర్పు కోసం టీవి ముందే కూర్చున్న శశికళ.. తీర్పు వెలువడగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోయినట్టు సమాచారం.
చెన్నై: దాదాపు పదిరోజుల పాటు హైటెన్షన్ క్రియేట్ చేసిన తమిళ పాలిటిక్స్ లో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు శశికళకు కన్నీరునే మిగిల్చింది. సోమవారం రాత్రి నుంచి తీవ్రమైన ఉత్కంఠతో తీర్పు కోసం వేచి చూసిన శశికళ.. తీర్పు తనకు ప్రతికూలంగా రావడంతో ఢీలా పడిపోయినట్టుగా తెలుస్తోంది.

సుప్రీం తీర్పు కోసం టీవి ముందే కూర్చున్న శశికళ.. తీర్పు వెలువడగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోయినట్టు సమాచారం.చాలాసేపు ఎవరితో మాట్లాడకుండా కంటతడి పెట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తీర్పు నేపథ్యంలో వెంటనే లొంగిపోయి రిసార్టు నుంచే జైలుకు వెళ్తానని శశికళ ఆవేదనతో చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఆమెను వారించి ఓదర్చడానికి ప్రయత్నిస్తున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు రిసార్టు బయట బౌన్సర్లు, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు నడుమ ఘర్షణ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇరు వర్గాలు రాళ్లదాడికి యత్నించినట్టుగా తెలుస్తోంది. దీంతో భారీ భద్రతా బలగాలు ప్రస్తుతం అక్కడ పాగా వేశాయి.












Click it and Unblock the Notifications