ఢిల్లీ పేలుళ్లు: భుల్లర్ మరణశిక్షపై సుప్రీంకోర్టు స్టే

భుల్లర్ భార్య అభ్యర్థనపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. మరణిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ భుల్లర్ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్ సెప్టెంబర్ 2013 నుంచి పెండింగులో ఉంది.
కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19వ తేదీన చేపడుతుంది. మెర్సీ పిటిషన్‌పై నిర్ణయంలో రాష్ట్రపతి చేసిన జాప్యం, దోషి మానసిక అనారోగ్యం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చడానికి అవసరమైన విషయాలని ప్రదాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది.
1993 సెప్టెంబర్ 11వ తేదీన న్యూఢిల్లీలోని రైసినా రోడ్డులో గల యూత్ కాంగ్రెసు కార్యాలయంపై దాడి కేసులో కోర్టు భుల్లర్‌కు మరణశిక్ష విధించింది. ఈ సంఘటనలో 9 మంది మరణించారు. ఈ దాడి యూత్ కాంగ్రెసు నాయకుడు మణీందర్‌తి సింగ్ బిట్టాను లక్ష్యంగా చేసుకుని జరిగింది.












Click it and Unblock the Notifications