ప్రేమించాలని లేడీ టీచర్‌పై హెడ్ మాస్టర్ పోరు

సేలం: పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ హెడ్ మాస్టర్ తనను ప్రేమించాలని సాటి మహిళా టీచర్ ను వేధింపులకు గురి చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సస్పెండ్ కావడంతో ఇప్పుడు లబోదిబో అంటూ పైఅధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాడు.

అధికారుల కథనం మేరకు తమిళనాడులోని సేలం సమీపంలోని నల్లూరు పంచాయితీ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సత్యరాజ్ ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన గారికి గతంలోనే వివాహం అయ్యింది.

ఇదే స్కూల్ లో ఓ అందమైన టీచర్ ఉద్యోగం చేస్తున్నారు. సత్యరాజ్ ఆ మహిళా టీచర్ మీద కన్ను వేశాడు. అంతే నిత్యం తనను వివాహం చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడు. అయితే ఆమె పరువు పోతుందని ఎవ్వరికి చెప్పలేదు.

School headmaster suspended for harassing teacher in Tamil Nadu

సత్యరాజ్ మరింత రెచ్చిపోయి వేధింపులకు గురి చేశాడు. ఆమె పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా చేశాడు. పెళ్లి చేసుకోకపోతే డెత్ నోట్ లో నీ పేరు వ్రాసి పెట్టి నేను ఆత్మహత్య చేసుకుంటానని, నీ ఉద్యోగం ఊడిపోయి జైలుకు వెళుతావని బెదిరించాడు.

విసిగిపోయిన ఆ మహిళా టీచర్ ధైర్యం చేసి డీఈఓకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు దర్యాప్తులో మహిళా టీచర్ ఆరోపణలు నిజమని గుర్తించారు. సత్యారాజ్ ను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ సీనియర్ అధికారి జ్ఞానగౌరి ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సత్యారాజ్ తనను కాపాడలని ఉన్నతాధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+