ప్రణబ్‌తో సీమాంధ్ర ఎంపీలు, అవిశ్వాసానికి శివసేన సై

న్యాయాన్యాయాలు పరిశీలించాకనే బిల్లును అసెంబ్లీకి పంపించాలన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని కోరారు. విభజన బిల్లును అనుమతించవద్దన్నారు. కాగా, రాష్ట్రపతిని కలిసిన వారిలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. వారు రెండు పేజీల మేమోరాండాన్ని సమర్పించారు.
అంతకుముందు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ప్రణబ్ ముఖర్జీని కలిశారు. కాగా, సీమాంధ్ర కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. దీంతో రెండు రోజులుగా ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి.
తెలంగాణకు అనుకూలం కాదు: శివసేన
తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకమని శివసేన నేత అనంత గీతే అన్నారు. విభజనపై అవిశ్వాసం పార్లమెంటుకు వస్తే తాము మద్దతు పలుకుతామని తెలిపారు.












Click it and Unblock the Notifications