రూపాయి షేర్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. ఒక్కరోజే 20 శాతం పెరుగుదల
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంచి జోష్‌లో కొనసాగి లాభాలతో ముగిశాయి. కీలక రంగాల్లో అమ్మకాలు జరుగుతుండటంతో షేర్లు రాణిస్తున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందాయి. పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకే మొగ్గు చూపుతున్నారు. విదేశీ మదుపరులు సైతం భారత మార్కెట్ల వైపు నిధులను మళ్లిస్తున్నారు.
బొంబాయి స్టాక్స్ సూచీ సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంతో 62 వేల 617 పాయింట్ల మార్క్ వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్స్ సూచీ నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 18 వేల 547 వద్ద ట్రేడవుతోంది. అపోలో ఆసుపత్రి, హెచ్‌యూఎల్, హీరో మోటో కార్ప్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్‌లో 959 షేర్లు నష్టాల్లో కొనసాగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో నువోకో విస్తాస్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లు లాభాలబాట పట్టాయి. కేడీడీఎల్ షేర్లు 12 శాతం మేర పెరగడంతో మార్కెట్లకు కొత్త ఉత్సాహం వచ్చింది. మార్కెట్లు ప్రారంభమైన తొలి గంటలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 0.02 శాతం పెరగడంతోపాటు నిఫ్టీ 50 సూచీ 0.06 శాతం మేర వృద్ది చెందింది. ఇటువంటి తరుణంలోనే కొన్ని పెన్నీ స్టాక్స్ అదరగొట్టాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువమంది మొగ్గుచూపారు. రూపాయి షేర్లను తమ వాచ్ లిస్టులో చేర్చుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. Shyamkamal Investments Ltd, Siddha Ventures Ltd, Kaushalya Infrastructure Development Corp, ibar Auto Parts Ltd, Country Condo's Ltd
సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, ఎల్ అండ్ టీ, టైటన్, ఎస్ బీఐ, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications