ముంబై ఫోటో జర్నలిస్ట్ అత్యాచార నిందితుడి అదృశ్యం!
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఫోటో జర్నలిస్ట్ రేప్ కేసు నిందితుడు ఒకరు జైలు నుండి అదృశ్యమైనట్లుగా వార్తలు వచ్చాయి. థానే జైలు నుండి అతను కనిపించకుండా పోయాడని ప్రచారం జరిగింది. అయితే నిందితుడు జైలులోనే ఉన్నాడని జైలు అధికారులు చెప్పారు. నిందితుడిని ఈ రోజు కోర్టులో ప్రవేశ పెట్టవలసి ఉంది. ఇతను ఎవరి వద్ద ఉన్నాడనే విషయమై రెండు డిపార్టుమెంట్ల మధ్య కొంత గందరగోళం ఏర్పడింది. దీంతో అతను పారిపోయాడని ప్రచారం జరిగింది. థానే జైలు అడిషనల్ డిజి మాత్రం నిందితుడు జైలులోనే ఉన్నాడని చెప్పారు.
కాగా, ఆగస్టు 22వ తేదిన ముంబైలోని శక్తి మిల్‌లో ఫోటో జర్నలిస్టు పైన ఐదుగురు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సామూహిక అత్యాచారం కేసును పోలీసులు 72 గంటల్లోగా ఛేదించారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారిని పట్టుకోవడానికి 20 పోలీసు బృందాలు వేట సాగించాయి.

సాధ్యమైనంత ఎక్కువ మందిని పోలీసులు ప్రశ్నించారు. ముంబై నుంచి మొదలు పెట్టి ఢిల్లీ వరకు అన్వేషణ సాగించారు. అత్యాచారానికి పాల్పడినవారు పాత నేరస్థులు కావడం పోలీసులకు వారిని పట్టుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అత్యాచారం చేసిన తర్వాత నిందితులు తమ సెల్‌ఫోన్లను ఆఫ్ చేశారు. దాంతో ఇన్‌ఫార్మర్ వ్యవస్థపై పోలీసులు ఎక్కువగా ఆధారపడ్డారు.
బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత ఐదుగురి స్కెచ్‌లు రూపొందించారు. స్కెచ్‌లు వారికి బాగా ఉపయోగపడ్డాయి. చంద్ అబ్దుల్ సత్తార్ షేక్ అనే నిందితుడిపై 2011లో అగ్రిపద పోలీసు స్టేషన్‌లో దొంగతనం కేసు నమోదైంది. బి గ్రేడ్ చిత్రం చూస్తుండగా నాగ్‌పదాలో విజయ్ జాదవ్‌ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై టార్డియో పోలీసు స్టేషన్‌లో అతనిపై పలు కేసులున్నాయి.
ఆ ఇద్దరి ఇళ్లలోనూ, వారి మిత్రుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించి సిరాజ్ రెహ్మాన్ ఖాన్ అలియాస్ సిరాజ్‌ను ముంబ్రాలో అరెస్టు చేశారు. కీలక నిందితుడు మొహమ్మద్ కాసిం హఫీజ్ షేక్ అలియాస్ బంగాలీని పోలీసులు ఆ తర్వాత నాయర్ ఆస్పత్రిలోని ఆరో అంతస్థులో అరెస్టు చేశారు. సాంకేతిక నిఘాతో ఐదో నిందితుడు మొహమ్మద్ సలీం అన్సారీని పోలీసులు ఢిల్లీలోని అశోక్ విహార్‌లో అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications