సాయిబాబాపై స్వరూపానంద, వైదొలిగిన న్యాయమూర్తి

ఈ ట్రస్ట్ బుధవారం సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి, ఆయన అనుచరులు సాయిబాబా పైన ఎలాంటి ప్రకటనలు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది.
దేశంలో ఎక్కడా ఏ ఆలయంలో నుంచీ వారు బాబు ప్రతిమలను తొలగించకుండా చూడాలని కోరింది. బాబాకు వ్యతిరేకంగా స్వామి స్వరూపానంద సరస్వతి, ఆయన అనుచరులు కించపరిచే, అవమానకర పదజాలం వాడారని, వారి వ్యాఖ్యలతో దేశ, విదేశాల్లో ఉనన కోట్లమంది బాబా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది.
ఈ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని తప్పుబట్టింది. కాగా, ఈ కేసును జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఎదుటకు వచ్చింది. కేసు విచారణ నుండి జస్టిస్ దవే వైదొలిగారు.












Click it and Unblock the Notifications