బుష్ నుంచి మాంఝీ వరకు: వీరిపైకి బూటు విసిరారు (ఫోటోలు)

న్యూఢిల్లీ: పాట్నాలో సోమవారం ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం 'జనతా దర్బార్'లో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి జతన్ రామ్ మాంఝీ పైకి ఓ యువకుడు బూటు విసిరాడు. వెంటనే భద్రత సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ముఖ్యమంత్రి కుల రాజకీయాలు చేస్తున్నారనే కోపంతోనే ఆయనపైకి బూటు విసిరానని అదుపులోకి తీసుకున్న యువకుడు పేర్కొన్నాడు. ఈ సంఘటనతో బీహార్ ముఖ్యమంత్రి మాంఝీ బాటు విసిరించుకున్న ప్రముఖుల జాబితాలోకి చేరాడు.

గతంలో ఇలాంటి అనుభవం అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, పి. చిదంబరం, అసిఫ్ ఆలీ జర్దారీ, టోనీ బ్లెయిర్, నితిన్ గడ్కరీ లాంటి వారికి ఎదురైంది. బూటు విసిరించుకున్న అనుభవాలు ఎదురైన కొందరు ప్రముఖ వ్యక్తులను పరిశీలిద్దాం.

 జార్జి బుష్

జార్జి బుష్

జార్బి బుష్‌కి ఈ అనుభవం ఇరాక్‌లో ఎదురైంది. ఇరాక్ అధ్యక్షుడు నూరి ఆల్ - మాలికీతో చేతులు కలిపిన అనంతరం బుష్ ఆయనతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆ బూట్లు ఎవరికీ తాకలేదు. విలేకరుల సమావేశంలో మూడో వరుసలో కూర్చున్న జర్నలిస్టు ఒక్కసారిగా లేచి ఇది వీడ్కోలు ముద్దు, కుక్కా అని బుష్ ను అంటూ ఆ జర్నలిస్టు బూట్లు విసిరాడు. మాలికీ బుష్ కు రక్షణగా వచ్చారు. ఆ తర్వాత ఇరాక్ భద్రతా సిబ్బంది ఆ జర్నలిస్టును బయటకు తీసికెళ్లారు.

 వెన్ జియాబాయో

వెన్ జియాబాయో

చైనా ప్రధాని వెన్ జియాబాయో కేంబ్రిడ్జి వచ్చినప్పుడు ఒక చైనా నిరసనకారుడు బూటు విసిరాడు.

 మన్మోహాన్ సింగ్

మన్మోహాన్ సింగ్

ప్రధాని మన్మోహన్ సింగ్ పైకి ఒక ఆగంతకుడు బూటు విసిరే ప్రయత్నం చేసాడు. అహ్మదాబాదులోని పాల్డీ ప్రాంతంలో గల టాగోర్ హాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రధానిపై ఆగంతకుడు బూటు విసిరే ప్రయత్నం చేశాడు. అతను విసిరిన బూటు ప్రధానికి తగలలేదు. ఆ ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లాల్ కృష్ణ అద్వానీ

లాల్ కృష్ణ అద్వానీ

భోపాల్‌లోని కట్నీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో అద్వానీపై ఈ బూటు దాడి జరిగింది. బీజేపీకి చెందిన పవాస్ అగర్వాల్ అనే కార్యకర్త అద్వానీపై ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడినుంచి అద్వానీ తప్పించుకోగా అక్కడే ఉన్న పోలీసులు సదరు కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు.

 ఆసిఫ్‌ అలీ జర్దారీ

ఆసిఫ్‌ అలీ జర్దారీ

బర్మింమ్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీపైకి ఒక వ్యక్తి తన బూట్లు విసిరాడు. అవి ఆయనకు కొద్ది దూరంలో పడ్డాయి. దేశం వరద బీభత్సంతో అల్లాడుతుండగా బ్రిటన్‌లో పర్యటి స్తున్నందుకు విమర్శల నెదుర్కొంటు న్న జర్దారీ, ఉపన్యాసం మధ్యలో ఉండగా, ముందున్న గుంపులోని ఒక వృద్ధుడు జర్దారీ పైకి తన బూట్లు విసిరాడు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా స్థానిక వికాస్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీపై ఒక యువకుడు బూటు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితమే అన్నా బృందం సభ్యులకు కూడా ఇదే విధంగా జరిగింది. యువకుడు విసిరిన బూటు రాహుల్‌కు పది మీటర్ల దూరంలో పడిందని డెహ్రా డూన్‌ ఎస్‌ఎస్‌పి జి.ఎన్‌. గోస్వామి పటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆ యువకుడిని కుల్దీప్‌గా గుర్తించామని, వెంటనే అతనినిఅదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

 అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్

అన్నా బృందం సభ్యులు అరవింద్‌ కేజ్రీవాల్‌, కిరణ్‌ బేడీ తదితరులు ఒక బహిరంగ సభలో మాట్లాడుతుండగా కిసాన్‌లాల్‌గా గుర్తించిన వ్యక్తి వారిపై బూటు విసిరాడు. అక్టోబర్ 18న ఈ సంఘటన జరిగింది. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

 పి. చిదంబరం

పి. చిదంబరం

న్యూఢిల్లీలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంపై ఓ సిక్కు జర్నలిస్ట్ జైర్నైల్ సింగ్ బూటు విసిరాడు. 1984 సిక్కుల ఊచకోత‌కు సంబంధించి జగదీష్ టైట్లర్‌కు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల జర్నలిస్ట్ జైర్నైల్ సింగ్ ప్రశ్నకు జవాబు చెప్పక పోవడంతో ఈ సంఘటన జరిగింది.

 ప్రకాశ్ సింగ్ బాదల్

ప్రకాశ్ సింగ్ బాదల్

పంజాబ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పైకి ఓ నిరుద్యోగ యువకుడు బూటు విసిరాడు. బూటు దూరంగా పడడంతో దాడి నుంచి బాదల్ తప్పించుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

 నితిన గడ్కరీ

నితిన గడ్కరీ

అక్టోబర్ 6, 2014న పూణె ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పైకి ఓ యువకుడు బూటు విసిరాడు. బీజేపీ అభ్యర్ధి మేథా కులకర్ణికి మద్దతుగా నితన్ గడ్కరీ ర్యాలీలో పాల్గొనేందుకు పూణెకి వచ్చిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది.

 ఒమర్ అబ్దుల్లా

ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సైతం బూటు అవమానం తప్పలేదు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పతాకావిష్కరణ కావిస్తోన్న ఒమర్ అబ్దుల్లా పైకి విధుల నుంచి సస్పెండైన పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ బూటు విసిరి నిరసన తెలిపాడు. అయతే, ఒమర్‌కు బూటు తగల్లేదు. బూటు విసిరిన వ్యక్తిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఒమర్ మాట్లాడుతూ ‘రాళ్లు విసరడం కంటే, బూటు విసరడమే మంచిది' అని కాశ్మీర్ పరిస్థితిపై చమత్కరించారు.

నవీన్ జిందాల్

నవీన్ జిందాల్

ఏప్రిల్ 2009లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ది నవీన్ జిందాల్ పై ఆయన సొంత నియోజక వర్గానికి చెందిన ఓ మాజీ ఉపాధ్యాయుడు చెప్పు విసిరి నిరసన తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+