మేడం! నాకూ: సుష్మకి షాక్, అద్వానీ వ్యాఖ్యపై నితీష్

చెన్నై: జఫ్తు చేసిన పాస్‌పోర్టు విషయంలో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీకి మానవత్వంతో సాయం చేసినట్లే తనకూ సాయం చేయాలని కూడంకుళం అణు విద్యుత్ కర్మాగార వ్యతిరేక ఉద్యమకారుడు ఉదయ్ కుమార్ బుధవారం కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు.

లలిత్ మోడీకి వ్యవహారంలో దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. తొలుత సుష్మా స్వరాజ్, ఆ తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు, అనంతరం ముగ్గురు మాజీ యూపీఏ మంత్రుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

లలిత్ పాస్ పోర్టు కోసం తాను మానవతా దృక్పథంతో సాయం చేసినట్లు సుష్మా స్వరాజ్ చెప్పినప్పటికీ... ఏడాదిగా మోడీపై ఆయుధం కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ దీనిని ఉపయోగించుకుంటోంది. నిబంధనల ప్రకారమే లలిత్ మోడీకి ఇచ్చామని యూకే కూడా చెప్పింది.

'Show humanitarian concern for our impounded passports too'

ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యలపై నితీష్ కుమార్

దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం లేకపోలేదన్న బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ వ్యాఖ్యల పైన నితీష్ కుమార్ స్పందించారు. బీహార్లో తాము అనునిత్యం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ఏమేం ప్రమాణాలు చేసిందో వచ్చాక ఏం చేస్తోందో ప్రజలు పరిశీలించాలన్నారు.

ఏడాదిగా అవినీతికి తావులేకుండా పాలించామని ఆ పార్టీ చెప్పుకుంటోందని కానీ అవన్నీ ఇప్పుడే మొదలయ్యాయని చెప్పారు. లలిత్ మోడీకి సుష్మా స్వరాజ్ సాయం చేశారన్న ఆరోపణల పైన ప్రధాని మోడీ మౌనం వహించడం ఆ చర్యలను అంగీకరించినట్లే అవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+