వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఇంటి కోసం సిద్దరామయ్య అన్వేషణ: కష్టకాలంలో, ప్రతిపక్షాలకు నోచాన్స్, ఎన్నికలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పుడు కొంత ఇంటి కోసం అన్వేషణ మొదలు పెట్టారు. కష్టకాలంలో ఆదుకున్న ప్రజలతో నిత్యం టచ్ లో ఉండాలని, ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వకూడదని, ఎన్నికలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కొత్త ఇంటికి వెళ్లాలని నిర్ణయించారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఎన్నికలు

ఎన్నికలు

శాసన సభ ఎన్నికల సందర్బంగా ముఖ్యమంత్రి హోదాలో సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో అట్టహాసంగా నామినేషన్ వేశారు. స్థానిక జేడీఎస్ ఎమ్మెల్యే జేటి. దేవేగౌడ చేతిలో ఓడిపోతారని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతో సిద్దరామయ్య ఆలోచనలోపడ్డారు.

బాదామిలో పోటి

బాదామిలో పోటి

ముఖ్యమంత్రి హోదాలో ఓడిపోతే అవమానం అని భావించిన సిద్దరామయ్య బాగల్ కోటే జిల్లా బాదామి నియోజక వర్గంలో బీఫారం అప్పటికే ఇచ్చిన అభ్యర్థిని నామినేషన్ వెయ్యకుండా పావులు కదిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి టిక్కెట్ ఇవ్వకుండా జాగ్రతలు తీసుకున్నారు. చివరికి సిద్దరాయ్య బాదామిలో నామినేషన్ వేశారు.

సిద్దూకు 2 వేల మెజారిటి

సిద్దూకు 2 వేల మెజారిటి

చాముండేశ్వరి నియోజక వర్గంలో జేడీఎస్ అభ్యర్థి జీటి. దేవేగౌడ చేతిలో 35 వేల ఓట్లకుపైగా తేడాతో సిద్దరామయ్య చిత్తుచిత్తుగా ఓడిపోయారు. బాదామి నియోజక వర్గంలో బళ్లారి శ్రీరాములు మీద కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సిద్దరామయ్య ఊపిరి పీల్చుకున్నారు.

ఆదుకున్న బాదామి

ఆదుకున్న బాదామి

కష్టకాలంలో అదుకున్న ప్రజలకు అందుబాటులో ఉండాలని సిద్దరామయ్య నిర్ణయించారు. బాదామిలో విజయం సాధించిన సిద్దరామయ్య ఇంత వరకూ ఆ నియోజక వర్గానికి వెళ్లి స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించారు.

సిద్దూకు ఇల్లు

సిద్దూకు ఇల్లు

బాదామిలో పోటీ చెయ్యడానికి టిక్కెట్ కు ఆశపడిన మహేష్ హోసగౌడ ఇంటితో సహ అనేక ఇండ్లు సిద్దరామయ్య కోసం ఆయన సన్నిహితులు చూసి పెట్టారు. జూన్ 1వ తేదీన సిద్దరామయ్య బాదామి వెలుతున్నారు. భద్రతా కారణాలరీత్య సిద్దరామయ్య నివాసం ఉండటానికి ఇల్లు చూడటం ఆలస్యం అయ్యిందని తెలిసింది.

ప్రతిపక్షాలకు చాన్స్

ప్రతిపక్షాలకు చాన్స్

కర్ణాటకలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, 2019లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలు విమర్శించడానికి అవకాశం ఇవ్వకుండా బాదామిలో నివాసం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిర్ణయించారని తెలిసింది.

English summary
Siddaramaiah planing to shift his residence to Badami constituency. His followers searching house for Siddaramaiah. On june 1st Siddaramaiah visiting Badami to thanks his voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X