బెంగళూరులో టెక్కీ, కుటుంబంలోని ఆరుగురు ఆత్మహత్య (పిక్చర్స్)
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం బెంగళూరులో ఓ కుటుంబంలోని ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన గురువారం నాడు చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఓ పెరాలసిస్ పేషెంట్ కూడా అన్నారు. ఈ సంఘటన బెంగళూరు నాగర్భావిలోని ఎంపీఎం లే అవుట్‌లో జరిగింది.
మృతు చెందిన వారు గంగ హనుమయ్య (57), ఆయన భార్య జయలక్ష్మమ్మ (54), మొదటి బిడ్డ హేమలత (30), రెండో కూతురు విమల, తనయుడు యతీష్ (26), ఆఖరు కూతురు నేత్రావతి (24).
గంగ హనుమయ్య బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. ఆయన భార్యకు పెరాలసిస్ ఉంది. మొదటి బిడ్డ హేమలత సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. రెండో కూతురు రైల్వే ఉద్యోగి. కొడుకు నిరుద్యోగిగా ఉన్నారు. ఆఖరి కూతురు ఇంజనీరింగ్ చదువుతున్నారు.

కుటుంబం ఆత్మహత్
అపార్టుమెంటులోని తోటి కిరాయిదారులు.... గంగ హనుమయ్య కుటుంబ సభ్యులు గురువారం ఉదయం ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చింది. వారు కిటికీలో నుండి చూశారు.

కుటుంబం ఆత్మహత్య
మృతుల్లో ఒకరు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నారు. దీంతో స్థానికులు దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన జ్ఞానభారతి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

కుటుంబం ఆత్మహత్య
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగుల గొట్టి ఇంటిలోకి వెళ్లారు. వారు అక్కడకు వెళ్లి చూసేసరికి కుటుంబ సభ్యులు అందరు కూడా మృతి చెంది ఉన్నారు.

కుటుంబం ఆత్మహత్య
కుటుంబంలోని ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. వారు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications