నేనెవర్నీ?: ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన కేంద్రమంత్రి ఇలా!

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. అయితే, ఈ సందర్భంగా సీరియళ్లు, సినిమాల్లో నటిస్తున్న సమయంలోని ఓ ఫొటోని ఆమె పోస్టు చేశారు.

'ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరు చేరారో ఊహించగలరా. మర్చిపోలేని పాత రోజులు' అని క్యాప్షన్‌ ఇచ్చారు స్మృతీ. అయితే స్మృతి ఖాతాకు ఇంకా అధికారిక గుర్తింపు రానప్పటికీ ఖాతా తెరిచిన 24 గంటల్లోనే 7వేల మందికిపైగా ఫాలోవర్లు చేరారు.

Smriti Irani makes her Instagram debut with a throwback pic; guess who welcomed her?

ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన స్పృతికి ఆమె స్నేహితురాలు, నిర్మాత ఏక్తా కపూర్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి 'నా స్నేహితురాలికి స్వాగతం' అని పోస్ట్‌ చేశారు. ఒకప్పుడు 'క్యూంకీ సాస్‌ భీ కభి బహూ థీ' అనే హిందీ టీవీ సీరియల్‌తో బుల్లితెరకు పరిచమయయ్యారు స్మృతీ ఇరానీ.

ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె సీరియళ్లు, సినిమాలకు దూరమయ్యారు. చివరిసారిగా ఆమె 'జైబోలో తెలంగాణ' అనే తెలుగు సినిమాలో నటించి ఆకట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+