రూ.40లక్షల జీతం.. అయినా చాలాదని!: కక్కుర్తికిపోయి పట్టుబడ్డాడు..

లీక్ చేసిన సమాచారాన్ని ఆన్ లైన్ లో పలు సంస్థలకు విక్రయించడం ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటూ వస్తున్నాడు.

బెంగుళూరు: అతనో ఐఐటీ పట్టభద్రుడు.. ఏటా లక్షల్లో జీతం.. అయినా సరే చాలదనిపించింది. అదనపు సంపాదన కోసం అక్రమ మార్గం ఎంచుకున్నాడు. ఐఐటీ తెలివి తేటలను ఆధార్ సమాచారాన్ని దొంగిలించడానికి ఉపయోగించాడు.

అలా దొంగిలించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. బెంగుళూరు పీఎస్‌లో దీనిపై ఫిర్యాదు అందడంతో అతగాని బాగోతం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. అభినవ్ శ్రీవాత్సవ(30) అనే టెక్కీ ఓలా కంపెనీలో ఏటా రూ.40లక్షల వేతనంతో పనిచేస్తున్నాడు. ఇంత డబ్బు సంపాదిస్తున్నా.. ఇంకా కూడబెట్టాలనే కోరిక మాత్రం అతన్ని నిలవనీయలేదు. ఇందుకోసం ఆధార్ సమాచారాన్ని లీక్ చేసే మార్గాన్ని ఎంచుకున్నాడు. లీక్ చేసిన సమాచారాన్ని ఆన్ లైన్ లో పలు సంస్థలకు విక్రయించడం ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటూ వస్తున్నాడు.

Software engineer held in Bengaluru for stealing Aadhaar data

హవ్యాసి అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా శ్రీవాత్సవ ఈ చౌర్యానికి పాల్పడుతున్నాడు. యూఐడీఏ ఆధార్ సర్వర్ లోకి చొరబడి అక్కడి సమాచారాన్ని లీక్ చేస్తున్నాడు. అభినవ్ ఇప్పటివరకు ఇలాంటివి ఐదు యాప్ లు క్రియేట్ చేశాడు.

ఇదే క్రమంలో గత జనవరి 26న డిప్యూటీ డైరెక్టర్ బెంగుళూరు హైగ్రౌండ్స్ లో శ్రీవాత్సవపై ఫిర్యాదు నమోదైంది. దీంతో కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎట్టకేలకు గురువారం శ్రీవాత్సవను పోలీసులు పట్టుకున్నారు.

2009లో ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన శ్రీవాత్సవ 2010లో బెంగళూరుకు చేరుకుని ఒక ప్రైవేటు కంపెనీలో చేరాడు. 2012లో సొంతంగా షేర్ లావాదేవీలు జరిపే సంస్థను ఏర్పాటు చేశాడు. నిర్వహణ భారంతో దాన్ని మూసివేసి 2015లో ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా చేరాడు.

గతేడాది బెంగళూరు ఓలా కేంద్ర కార్యాలయంలో ఏడాదికి రూ.40లక్షల వేతనంతో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా విధులు నిర్విర్తిస్తున్నాడు. అది గాక ఆధార్ సమాచారాన్ని లీక్ చేస్తూ అదనంగా సంపాదిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. చట్ట వ్యతిరేక ఆధార్ యాప్ లను రూపొందించడం తదితర అభియోగాలపై మరింత విచారణ చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. నిందితుడు నుంచి 4ల్యాప్ టాప్, 1ట్యాబ్లెట్, 4 సెల్ ఫోన్స్, 6పెన్ డ్రైవ్స్, 1కంప్యూటర్ తో పాటు రూ.2.25లక్షల విలువైన ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+