కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ; రేపు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సోనియా భేటీ ! : జగ్గారెడ్డి విషయాన్ని తేల్చేస్తా

అంతర్గత కుమ్ములాటతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకు ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీ నడుంబిగించారు. రేపు ఢిల్లీలో కీలక భేటీని ఏర్పాటు చేశారు. ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో సోనియాగాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి.. పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చిస్తారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఆపజయంపై నేతల నుంచి వివరాలను తీసుకోనున్నారు. పార్టీలో నెల‌కొన్న వ‌ర్గ‌విభేదాలు, అస‌మ్మ‌తిపై చ‌ర్చిస్తారు.

అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై కీల‌క నిర్ణ‌యం...

అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై కీల‌క నిర్ణ‌యం...

ఇప్పటికే సీనియర్ల జీ 23 పేరుతో కాంగ్రెస్ పార్టీని, గాంధీల నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రోజు రోజుకు పార్టీ ప్రభావాన్ని కోల్పోతున్న విధానంపై వారు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ప్రక్షాళన అవసరం అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ అధ్యక్షత జరిగే రేపటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఉదయం 11 గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు, పార్టీ ప్రక్షాళన వంటి ప్రధాన అంశాలపై చర్చ జరగనుంది.

 ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌

ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌


మరోవైపు ఈనెల 31కి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగుస్తుంది. ఈనేపథ్యంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో సభ్యత్వాలు ఎంత నమోదయ్యాయనే వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. వాటిపై సీమక్ష నిర్వహించనున్నారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన ఆందోళనల కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా ఆందోళనకు కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించే అవకాశం ఉంది.

తెలంగాణ‌పై దృష్టి

తెలంగాణ‌పై దృష్టి


అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్మ‌లాటలు తారాస్థాయికి చేరాయి. రెండు వ‌ర్గాలు చీలిపోయాయ‌న్న విధంగా హ‌స్తం నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి పోస‌గడం లేదు. అటు సీనియ‌ర్ నేత‌లు రేవంత్ కు వ్య‌తిరేకంగా ప్ర‌త్యేక స‌మావేశం కూడా నిర్వ‌హించారు. అధిష్టానం ఆదేశాల‌ను కూడా ప‌ట్టించుకోకుండా స‌మావేశ‌మైయ్యారు. తాము అస‌మ్మ‌తి వ‌ర్గం కాదంటూ పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న దానిపై చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

జ‌గ్గారెడ్డి త‌ప్పులేదు

జ‌గ్గారెడ్డి త‌ప్పులేదు


పార్టీ పరిణామాలపై సోనియా గాంధీ దృష్టి పెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు కోరారు. సీనియర్ నేతలను పిలిచి మాట్లాడాలన్నారు. పార్టీలో ఉన్న సమస్యలపై చర్చించాలన్నారు. సీనియర్ నేతల సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు తీర్మానం చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పులేదన్నారు. గాంధీభవన్ లో కొంతమంది రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన భావోధ్వేగానికి లోనయ్యారని అందుకే అలా మాట్లాడారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా సీనియర్ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ల కంటే దీటుగా ప్రజల్లోకి వెళ్లేల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని వీహెచ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+